CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే జీవోతో 6,729 మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులపై ఈ వేటు పడింది. ఈ జాబితాలో అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారుల వరకు, హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, ట్రాన్స్‌కో–జెన్‌కో డైరెక్టర్లు వంటి కీలక వ్యక్తులు ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి వీరిని తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Shanthi Kumari) ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ఉద్యోగ నియామకాలకు అవకాశం కల్పించాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా రిటైర్మెంట్ తర్వాత కీలక పదవుల్లో కొనసాగుతున్న వారిని గుర్తించి, ఒకే ఆర్డర్‌తో ఇంటికి పంపారు.
Also Read: ముస్లింల హెచ్చరిక.. రేపు మహాధర్నా.. సంకటంలో చంద్రబాబు!
శాఖల వారీగా…
మున్సిపల్ శాఖలో 177 మంది, ఇరిగేషన్‌లో 200 మందికి పైగా, పోలీసు శాఖలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత పలువురిని తొలగించారు. రెవెన్యూ, దేవాదాయ, విద్య, రవాణా వంటి శాఖల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వం ఈ చర్య ద్వారా కొత్త నియామకాలకు మార్గం సుగమం చేయనుంది. గ్రూప్–1 నుంచి గ్రూప్–4 వరకు నోటిఫికేషన్లు జారీ చేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావిస్తోంది.
ప్రమోషన్లకు ఛాన్స్…
తాజా చర్యతో ప్రస్తుత ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశం ఏర్పడనుంది. అయితే, తొలగించిన వారిలో ఎవరైనా అవసరమని భావిస్తే, మరో నోటిఫికేషన్ ద్వారా తిరిగి నియమించుకునే వెసులుబాటు కల్పించారు. మెట్రో రైల్‌ను పర్యవేక్షిస్తున్న ఎన్‌వీఎస్ రెడ్డికి మళ్లీ అవకాశం లభించే అవకాశం ఉందని అంచనా. సీఎం నిర్ణయంతో ప్రభుత్వ వర్గాల్లో, ఉద్యోగుల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కొత్త అవకాశాల సృష్టి, మరోవైపు అనుభవజ్ఞుల తొలగింపుౄఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారనేది ఆసక్తికరంగా ఉంది.