Chandrababu Naidu Hyderabad : తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం 70 శాతం వరకు హైదరాబాద్(Hyderabad) నుండే వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా హైదరాబాద్ ఆ స్థాయిలో డెవలప్ అవ్వడానికి ఒక పది కారణాలు ఉంటే అందులో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎన్ని తరాలు అయినా దీని గురించి జనాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. సైబర్ టవర్స్ ని నిర్మించి, ప్రముఖ IT కంపెనీలను హైదరాబాద్ కి తీసుకొని రావడం వల్ల దానికి అనుసంధానంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్ IT సంస్థలకు నిలయం గా మారే అవకాశాలు ఉన్నాయని బలంగా ఇతర IT సంస్థలు కూడా నమ్మడంతో అన్ని ప్రముఖ సంస్థలు హైదరాబాద్ కి వచ్చాయి. అలా పెరుగుతూ పోయింది.
అప్పటి సీఎం చంద్రబాబు చేసిన ఈ అభివృద్ధి ని, ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఆపకుండా కొనసాగిస్తూ ముందుకు తీసుకొని వెళ్లడం వల్ల హైదరాబాద్ నేడు ఈ స్థాయిలో ఉంది. అయితే పోలవరం, బనకచర్ల నది జలాల పట్ల ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశం పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా ఈమధ్య చాలా ఘాటుగా స్పందించాడు. నేడు సచివాలయం లో సీఎం చంద్రబాబు వివిధ అంశాల కోసం ప్రెస్ మీట్ ని నిర్వహించాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. విలేఖరులు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు దృష్టికి తీసుకొని రాగా దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటో మీరే చూడండి.
సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కోసం నేను హైదరాబాద్ ని అభివృద్ధి చేసాను. దానిని ప్రతీ ఒక్కరు అంగీకరిస్తున్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు అది తెలంగాణ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వాళ్ళతో గొడవ పడడం వల్ల వచ్చేది ఏమిటి?, కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు, ఒక రాజకీయ నాయకుడిగా నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టం బాగా పని చేసి, సంపద సృష్టించి, దాని వల్ల తెలుగు జాతి బాగుపడుతూ ఉంది. అందుకు ఒక రాజకీయ నాయకుడిగా ఎంతో సంతృప్తి చెందుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
నేను క్రియేట్ చేసిన హైదరాబాద్ ఎకో సిస్టమ్ బాగా పనిచేసి తెలుగు జాతికి ఉపయోగపడుతుందని ఆనందంగా ఉంది – చంద్రబాబు నాయుడు pic.twitter.com/crXWSkP7qK
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2025