Modi Yoga Day 2025 : ఈ నెల 21 వ తారీఖున అంతరాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా వైజాగ్ లోని RK బీచ్ వద్ద లక్షలాది మందితో యోగాసనాలు వేయించే కార్యక్రమం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏర్పాట్లు భారీ గా చేస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నాడు. లక్షలాది మంది జనాలతో పాటుగా ఆయన కూడా యోగాసనాలు వెయ్యబోతున్నాడు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తో పాటు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతీ ఒక్కరు హాజరు కాబోతున్నారు. మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.
గత పది రోజుల నుండి ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఒకవేళ ఈ కార్యక్రమం లో పాల్గొనే పరిస్థితి ఉంటే ఈపాటికి జనసేన పార్టీ సోషల్ మీడియా నుండి అధికారిక ప్రకటన వచ్చేది. ఎల్లుండే కార్యక్రమం అయినప్పటికీ ఇప్పటి వరకు ఆయన ఈ కార్యక్రమం లో పాల్గొంటాడా లేదా అనే దానిపై సమాచారం రాలేదు. ప్రధాన మంత్రి అంటే పవన్ కళ్యాణ్ కి ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన వస్తున్నాడంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎన్ని పనులున్నా మానుకొని వచ్చిన సందర్భాలు గతం లో చాలానే ఉన్నాయి. అలాంటి పవన్ కళ్యాణ్ ఈసారి అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందా లేదా అనేది రేపటి వరకు వేచి చూడాలి. ప్రభుత్వం తరుపున ఇచ్చిన ప్రకటన లో మాత్రం కేవలం సీఎం చంద్రబాబు నాయుడు, పీఎం నరేంద్ర మోడీ పేర్లను మాత్రమే ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ని ప్రస్తావించలేదు.
ఒకవేళ ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వస్తే అందరిలో బాగా హైలైట్ అయ్యే అవకాశం ఉంది. సీఎం, పీఎం ఇద్దరూ కూడా డామినేట్ అవుతారని అంటున్నారు నెటిజెన్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక సినీ నటుడు అవ్వడం వల్ల, ఆయనని చూసేందుకు కోసం లక్షలాది గా జనాలు తరళి వస్తారు. అలాంటి జనాలతో కలిసి ఆయన కూడా యోగాసనాలు వేస్తే పరిస్థితి అదుపులో ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. చూడాలి మరి ఏమి జరగబోతుందో. ఒకవేళ 21 న షూటింగ్ ఉన్నప్పటికీ, ఉదయం ఈ ఈవెంట్ లో పాల్గొని మళ్ళీ తిరిగి హైదరాబాద్ కి వెళ్లొచ్చు. మరి పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటో చూడాలి. ఒక పక్క రాజకీయాలు, మరో పక్క సినిమాలు ఏకకాలం లో సమర్థవతంగా కొనసాగిస్తూ, లుక్స్ ని కూడా మైంటైన్ చేస్తున్నాడంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ రోజూ యోగా చేయడం వల్లే, మరి ఒకవేళ ఆయన వస్తే ఆసనాలు ఏ రేంజ్ లో వేస్తాడో చూడాలి.