AP Mega DSC: మెగా డీఎస్సీ ఫైల్ పైనే చంద్రబాబు తొలి సంతకం?

AP Mega DSC: జగన్ ఐదేళ్ల పాలనలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేయలేదు. విపక్షంలో ఉన్నప్పుడు మెగా డీఎస్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు 6000 పోస్టులతో మినీ డీఎస్సీ ని ప్రకటించారు.

Written By: Dharma, Updated On : June 10, 2024 12:49 pm

Chandrababu Naidu first sign on Mega DSC notification

Follow us on

Andhra Pradesh: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ తో పాటు జాతీయస్థాయి నాయకులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. చంద్రబాబుతో పాటు పవన్, ఇతర మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. క్యాబినెట్ కూర్పుపై కూడా కసరత్తు జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి కూటమి చాలా రకాలుగా హామీలు ఇచ్చింది. అవి అమలు చేస్తామని స్పష్టమైన సంకేతాలు పంపించేలా ప్రమాణస్వీకారం రోజున కీలక ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మెగా డీఎస్సీ భర్తీపై మొదటి సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: YS Jagan: జగన్ కి లిక్కర్ షాక్

జగన్ ఐదేళ్ల పాలనలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేయలేదు. విపక్షంలో ఉన్నప్పుడు మెగా డీఎస్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు 6000 పోస్టులతో మినీ డీఎస్సీ ని ప్రకటించారు. అప్పుడే విపక్షాలు జగన్ పై ఆరోపణలు గుప్పించాయి. నిరుద్యోగ యువత సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. యువతలో వైసిపి పట్ల వ్యతిరేకతకు ఇది ఒక కారణమైంది. అదే సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబుతో పాటు పవన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ పై అని తెలుస్తోంది.

Also Read: YS Sharmila : కాంగ్రెస్ ఫండింగ్ పక్క దారి.. షర్మిలపై ఆరోపణలు నిజమేనా?

రాష్ట్రంలో ప్రస్తుతం 39 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది జూలై 31న లోక్సభలో ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి సమాధానమిచ్చారు. అయితే 30 వేల పోస్టులను భర్తీ చేస్తారా? లేకుంటే విడతల వారీగా వాటిని భర్తీ చేస్తారా? ఐదేళ్ల పదవీకాలంలో ఏటా డీఎస్సీ ప్రక్రియ ఉంటుందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఏపీలో నిరుద్యోగులు సంతృప్తి పడేలా డీఎస్సీ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ ఫైల్ పైనే తొలి సంతకం చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.