Chandrababu And Jagan: చంద్రబాబు,జగన్ రహస్య భేటీ అయ్యారా? లండన్ లో కలుసుకున్నారా?ఉన్నత స్థాయి సమావేశం వారి మధ్య జరిగిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కానీ ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియడం లేదు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఈ భేటీ జరిగి ఉండవచ్చు. ఊహాగానమైన అవ్వొచ్చు. కానీ అసాధ్యం కాదు. ఎందుకంటే రాజకీయ హేమహేమీలు, చిరకాల ప్రత్యర్థులు సైతం సంధి చేసుకుంటున్న రోజులు ఇవి. అటువంటిది చంద్రబాబు, జగన్ మధ్య భేటీ కొట్టి పారేయలేము అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. వాసన లేనిదే ఈ విషయం బయటకు వచ్చే ఛాన్స్ లేదని.. ఏదో జరిగి ఉంటుందని ఎక్కువమంది అనుమానిస్తున్నారు.
సిబిఐ కేసుల్లో జగన్ అరెస్ట్ అయ్యారు. దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. ఇప్పటికీ ఆ కేసులు జగన్ మెడకు చుట్టుకునే ఉన్నాయి. అధికారం కోల్పోయిన మరుక్షణం ఈ కేసులు ఊపిరి ఆడనివ్వవు. ఈ విషయం జగన్ కు తెలియంది కాదు. అదే సమయంలో చంద్రబాబు పై సైతం జగన్ సర్కార్ అవినీతి కేసులను నమోదు చేయగలిగింది. జగన్ అధికారంలోకి వస్తే ఆ కేసుల్లో చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. వాస్తవానికి చంద్రబాబును టచ్ చేసేందుకు ఏ ముఖ్యమంత్రి సాహసించలేదు. అటువంటిది జగన్ టచ్ చేశారు. 52 రోజులపాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు.దేశంలో ఏ రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీల అధినేతల మధ్య ఈ తరహా యుద్ధంలేదు. అందుకే వారిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చేందుకు భేటీ అయ్యారు అన్నది ఒక అనుమానం.
ఈ ఇద్దరి నేతల మధ్య పోరాటంలో జాతీయ పార్టీలు కలుగు చేసుకుంటున్నాయి. ఆయాచిత లబ్ధి పొందుతున్నాయి. మొన్నటి వరకు బిజెపి జగన్ కు సహకరించింది. ఇప్పుడు చంద్రబాబుతో జత కలిసింది. మొన్నటివరకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు విషయంలో పునరాలోచనలో పడింది. అదే సమయంలో జగన్ ను సాఫ్ట్ కార్నర్ తో చూస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో జాతీయ పార్టీలు తమను వాడుకుంటున్నాయి అన్న విషయాన్ని చంద్రబాబు, జగన్ గ్రహించినట్టు ఉన్నారు. అందుకే ఎవరు అధికారంలోకి వచ్చినా.. సహకరించుకుందామన్న ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇది కేవలం ఊహాజనితమే. దీనిని ధ్రువీకరించే ఛాన్స్ లేదు. ప్రస్తుతం చంద్రబాబుతో బ్రిటన్ లోని ఓ నగరంలో ఉన్నారు. దీంతో సహజంగానే వారు కలిశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం కనుక.. ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు. నిజం అనేది వారిద్దరికే తెలియాలి.