https://oktelugu.com/

Hardhik Pandya : హార్దిక్ పాండ్యా భార్య రొమాన్స్ చేసింది అతడితోనా.. మధ్యలో దిశాపటాని కి ఏం సంబంధం?

నటాషా సెర్బియా ప్రాంతానికి చెందిన ఒక డ్యాన్సర్, మోడల్.. తన కెరియర్ ను అభివృద్ధి చేసుకునేందుకు ముంబై వచ్చింది. ప్రకాష్ ఝా దర్శకత్వంలో సత్యాగ్రహ అనే చిత్రంలో నటించింది.

Written By: , Updated On : May 28, 2024 / 02:43 PM IST
hardik-pandya-natasa-disha-patan

hardik-pandya-natasa-disha-patan

Follow us on

Hardhik Pandya : హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) విడాకుల వ్యవహారం రోజురోజుకు మరింత చర్చకు దారితీస్తోంది. ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో ముగుస్తుందనగా ఈ విషయం వెలుగులోకి రాగా.. రోజుకో తీరుగా అటు మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీస్తోంది. మరోవైపు హార్థిక్ పాండ్యా భార్య నటాషా చేస్తున్న ట్వీట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

కొంతకాలంగా హార్దిక్ పాండ్యా, నటాషా(Natasha) ఇన్ స్టా గ్రామ్ లో ఆంటీ ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు అన్ ఫ్రెండ్ చేసుకున్నారు. అయితే ఇందులో నటాషా హార్దిక్ పాండ్యా తో ఉన్న ఫోటోలను ఇంకా డిలీట్ చేయలేదు.. ఈ విడాకులకు సంబంధించి రూమర్స్ వినిపిస్తుండగానే.. నటాషా బాలీవుడ్ నటి దిశాపటాని మాజీ ప్రేమికుడితో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుండడం సరికొత్త చర్చకు దారితీస్తోంది..

హార్దిక్ పాండ్యా, నటాషా చాలా సంవత్సరాల పాటు సహజీవనం చేశారు. కోవిడ్ సమయంలో వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి అత్యంత రహస్యంగా జరగడంతో.. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. అనంతరం వారికి అగస్త్య పాండ్యా అనే బాబు పుట్టాడు. ప్రస్తుతం ఇతడికి మూడు సంవత్సరాలు. కొంతకాలం నుంచి హార్దిక్ పాండ్యా, నటాషాకు విభేదాలు కొనసాగుతున్నాయి.. ఫలితంగా ఇద్దరు దూర దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. పరిష్కరించలేని స్థాయిలో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్టు తెలుస్తోంది.. మరోవైపు నటాషా తన ఇన్ స్టా గ్రామ్ లో తన పేరు పక్కన హార్థిక్ పాండ్యా పేరును తొలగించింది. దాంతో వీరిద్దరూ విడిపోతున్నారు అనే అనుమానాలకు బలం చేకూరింది..

తాజాగా దిశ పటాని(Disha Pathani) మాజీ ప్రేమికుడితో నటాషా చనువుగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి.. దీంతో, నటాషా, హార్దిక్ మధ్య విభేదాలు నిజమేనని తేలిపోయింది. ఆమె హార్దిక్ పాండ్యాకు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అటు పాండ్యా, ఇటు నటాషా పెద్దగా నోరు విప్పడం లేదు. దీంతో మీడియాలో మాత్రం రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల ముంబైలో కనిపించినప్పుడు నటాషాను కొంతమంది విలేకరులు విడాకుల గురించి ప్రస్తావించగా.. ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది. పదేపదే ఆ విషయాన్ని వారు అడగడంతో.. నటాషా మౌనాన్ని ఆశ్రయించింది. చివరికి థాంక్యు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయింది.. అయితే ఆ సమయంలో నటాషా వెంట దిశాపటాని మాజీ ప్రేమికుడు ఉండడం విశేషం.

నటాషా సెర్బియా ప్రాంతానికి చెందిన ఒక డ్యాన్సర్, మోడల్.. తన కెరియర్ ను అభివృద్ధి చేసుకునేందుకు ముంబై వచ్చింది. ప్రకాష్ ఝా దర్శకత్వంలో సత్యాగ్రహ అనే చిత్రంలో నటించింది. బిగ్ బాస్ 8, నాచ్ బలియా అనే రియాల్టీ షోలో మెరిసింది. హార్దిక్ పాండ్యాతో ప్రేమలో పడింది. దీంతో ఆమెకు సెలబ్రిటీగా మరింత పేరు వచ్చింది.