Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: తనను అరెస్ట్ చేసిన ఐపీఎస్ కు గట్టి షాక్ ఇచ్చిన చంద్రబాబు

Chandrababu: తనను అరెస్ట్ చేసిన ఐపీఎస్ కు గట్టి షాక్ ఇచ్చిన చంద్రబాబు

Chandrababu: ఏపీలో కొందరు అధికారులు భయపడుతున్నారా? తమపై చర్యలు తప్పవని ఆందోళనతో ఉన్నారా? చంద్రబాబు ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా కొందరు అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటించారు. ముఖ్యంగా విపక్ష నాయకులపై విరుచుకుపడ్డారు. పెద్దలకు వీర విధేయత చూపారు. అయితే ఇప్పుడు అధికారం తారుమారు కావడంతో పశ్చాత్తాప పడుతున్నారు. భయంతో నలిగిపోతున్నారు. ముఖ్యంగా సిఐడి మాజీ అధికారి కొల్లి రఘురామిరెడ్డి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయనకు కనీసం చంద్రబాబును కలిసేందుకు అనుమతి కూడా ఇవ్వలేదు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజులు పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. తన అరెస్టులోనిబంధనలు పాటించలేదని చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు కూడా పూర్తయ్యాయి. తీర్పు రిజర్వులో ఉంది. అయితే ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అధికారి కొల్లి రఘురామిరెడ్డి. చంద్రబాబు నంద్యాల పర్యటనలో ఉండగా అరెస్ట్ అయ్యారు. బస్సులో ఉండగా అర్ధరాత్రి తలుపు తట్టి మరి అరెస్టు చేశారు. రోడ్డు మార్గం గుండా విజయవాడ తీసుకొచ్చారు. ఈ అరెస్టులో కొల్లి రఘురామిరెడ్డి దే కీలకపాత్ర. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నిబంధనలను పక్కనపెట్టి మరి నాడు చంద్రబాబును అరెస్టు చేశారు.

కొల్లి రఘురామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆయనను విధుల నుంచి తప్పించింది ఈ సి. ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా డిజిపి కార్యాలయంలో రిపోర్టు కావాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు అంతులేని మెజారిటీతో టిడిపి అధికారంలోకి రావడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే లోకేష్ రెడ్ బుక్ రాశారు. ప్రభుత్వ పెద్దలకు కొమ్ము కాసి.. అక్రమంగా వ్యవహరించిన అధికారులను వదిలి పెట్టేది లేదని లోకేష్ తో పాటు పవన్ హెచ్చరించారు. ఇప్పుడు ఏపీలో కూటమి గెలవడంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో సైతం చంద్రబాబు పాత్ర పెరిగింది. దీంతో వైసిపి హయాంలో అతి చేసిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఆందోళనతో గడుపుతున్నారు. అందులో ఒకరైన కొల్లి రఘురామిరెడ్డి నేరుగా చంద్రబాబును కలిసేందుకు విఫల యత్నం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ ఆయనకు చంద్రబాబును కలిసేందుకు అనుమతి లభించలేదు. దీంతో నిరాశతో వెనుదిరిగారు కొల్లి రఘురామిరెడ్డి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular