spot_img
Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu : నువ్వు కాలికి నమస్కారం పెడితే.. నేను చేస్తా.. చంద్రబాబు చేసిన పనికి...

CM Chandrababu : నువ్వు కాలికి నమస్కారం పెడితే.. నేను చేస్తా.. చంద్రబాబు చేసిన పనికి అంతా షాక్

CM Chandrababu : రాజకీయ పార్టీల అధినేతలకు ఒంగి ఒంగి నమస్కారాలు చేయడం సర్వసాధారణం. తమిళనాడులో ఇటువంటి సంస్కృతి అధికంగా ఉండేది. అక్కడ పార్టీ అధినేతల ఆశీస్సుల కోసం నేతలు చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు. సాష్టాంగ నమస్కారాలు అక్కడ కనిపిస్తుంటాయి.అయితే స్టాలిన్ సీఎం అయిన తర్వాత అక్కడ పరిస్థితి కొంతవరకు మారింది. అయితే ఏపీలో కూడా ఇటువంటి జాడ్యం ఉండేది. జగన్ సీఎం అయిన తర్వాత ఆ పార్టీ నేతలు ఆయనలో ఒక దేవుడిని చూసేవారు.మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రోజు అయితే.. ఆయన కంటే వయసుకు పెద్దవారు సైతం కాలికి నమస్కారం చేశారు. చేతికి ముద్దులు పెట్టారు. అదో స్వామీజీలా జగన్ ఫీలయ్యేవారు.కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు కనిపించింది.కాలి మీద పడడాలు,సాష్టాంగ నమస్కారాలు వద్దని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం లో చాలామంది నేతలు చంద్రబాబుకు నమస్కారం చేసే ప్రయత్నం చేశారు. కానీ వద్దని వారించారు చంద్రబాబు. అయితే అప్పట్లో చంద్రబాబు ఒక ప్రకటన చేశారు.ఎవరు కాళ్లకు నమస్కారం పెట్టవద్దని..అలా పెడితే తిరిగి పెట్టాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు కొంతవరకు వెనక్కి తగ్గారు. కేవలం చేతితో నమస్కారం వరకే పరిమితం అయ్యారు.

* ఓ వ్యక్తికి షాక్
అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.రాజధానిలో సిఆర్డిఏ భవన నిర్మాణానికిచంద్రబాబు భూమి పూజ చేశారు.పనులను తిరిగి ప్రారంభించారు.ఈ క్రమంలో ఒక వ్యక్తి వచ్చి చంద్రబాబు కాలికి నమస్కారం చేసే ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న చంద్రబాబు వద్దని వారించారు. తిరిగి ఆ వ్యక్తి కాలికి నమస్కారం చేసే ప్రయత్నం చేశారు. దీంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. చంద్రబాబు వ్యవహార శైలి చూసి కంగుతిన్నారు. నమస్కారం పెడితే ఇదే తరహా లో నేను పెడతానంటూ సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు.

* ప్రధాని మోడీ సైతం
అయితే జాతీయస్థాయిలో సైతం ప్రధాని మోదీ ఈ సాష్టాంగ నమస్కారాలకు చెక్ చెప్పారు. వయసుకు పెద్దవారిగా, ఈ దేశానికి ప్రథమ పౌరుడిగా ఉన్న ప్రధాని కాలికి సాధారణంగా నమస్కారం చేసే ప్రయత్నం చేస్తారు. అయితే నేతలకు ఆ అవకాశం ఇవ్వడం లేదు ప్రధాని. వయసుకు అత్యంత చిన్నవారిని సైతం నమస్కరించవద్దని మోడీ సూచించారు. ఏపీ క్యాబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం నాడు చాలామంది మోదీ కాలికి సైతం నమస్కరించే ప్రయత్నం చేశారు. ఆయన వద్దంటూ సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కాలికి నమస్కారం చేసే సంస్కృతికి చెక్ పడుతుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version