https://oktelugu.com/

Screenplay : అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి..? సినిమా సక్సెస్ లో స్క్రీన్ ప్లే ఎలాంటి పాత్ర పోషిస్తుంది..?

సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తున్న దర్శకులు ఆ సినిమా తాలూకు ఇంటెన్స్ ని వాళ్లు అర్థం చేసుకొని దాని భావాన్ని ప్రేక్షకుడికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్ బాగా రాసుకొని సినిమా చేస్తుంటారు. ప్రతి సీన్ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉన్నప్పుడు మాత్రమే అతనికి బోర్ కొట్టకుండా మొదటి నుంచి చివరి వరకు సినిమాను చేసి ఆ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపుతారు.

Written By:
  • Gopi
  • , Updated On : October 20, 2024 / 11:30 AM IST

    Screenplay

    Follow us on

    Screenplay : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు వాళ్ళు చేస్తున్న సినిమాలను ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయాలంటే ఆ సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉండాలి. ముఖ్యంగా కథ విషయంలో దర్శకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక దానికి సంబంధించిన క్యారెక్టర్ ని ముందుగానే రాసుకొని ఆయా పాత్రల తాలూకు లక్షణాలను కూడా అందులో పొందుపరచాలి. అలా చేయడం వల్ల క్యారెక్టర్ అనేది బాగా డెవలప్ అవుతుందనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే కథ మొత్తం ఫైనలైజ్ అయిన తర్వాత సినిమాకి స్క్రీన్ ప్లే అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అంటే ఏంటి స్టోరీ కి దానికి సంబంధం ఏంటి అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. నిజానికైతే సినిమాలో ఎక్కడెక్కడ హై మూమెంట్స్ ఉండాలి ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి అనే దానిని రాసుకునేదే స్క్రీన్ ప్లే… ప్రస్తుతానికి అయితే స్క్రీన్ ప్లే విషయంలో చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా స్క్రీన్ ప్లే అనేది సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహిస్తుంది. ఇందులో లీనియర్, నాన్ లీనియర్,బ్యాక్ అండ్ ఫోర్త్ అంటూ డిఫరెంట్ స్క్రీన్ ప్లే లు ఉంటాయి…

    ప్రేక్షకుడు సినిమాని చూసే సమయంలో ఏ సీన్ తర్వాత ఏసీ పడితే హై ఎలివేషన్ వస్తుంది అనేది దృష్టిలో పెట్టుకొని దర్శకుడు ఈ స్క్రీన్ ప్లేని రాసుకోవాల్సి ఉంటుంది. కథ రొటీన్ గా ఉన్న కూడా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండటం వల్ల సక్సెస్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.

    కాబట్టి ఒక సినిమా సక్సెస్ లో అన్నిటికంటే ముఖ్యంగా స్క్రీన్ ప్లే కీలకపాత్ర వహిస్తుందనేది చాలా స్ట్రాంగ్ గా చెప్పవచ్చు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సక్సెస్ లను సాధించాలంటే మాత్రం దర్శకుడు చాలా కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. ఇక అంత సులువుగా సక్సెస్ అయితే రాదు.

    మనం అనుకున్న పాయింట్ ను జనానికి రీచ్ అయ్యే విధంగా చెప్పగలిగితే ఆ సినిమా అద్భుతంగా ఎలివేట్ అవుతుంది. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ప్రతి ఒక్క దర్శకుడు వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని దానికి ది బెస్ట్ స్క్రీన్ ప్లే ని అందించి ఆ సినిమాను సూపర్ సక్సెస్ గా నిలపాల్సిన అవసరమైతే ఉంటుంది…