CM Chandrababu : రాజకీయ పార్టీల అధినేతలకు ఒంగి ఒంగి నమస్కారాలు చేయడం సర్వసాధారణం. తమిళనాడులో ఇటువంటి సంస్కృతి అధికంగా ఉండేది. అక్కడ పార్టీ అధినేతల ఆశీస్సుల కోసం నేతలు చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు. సాష్టాంగ నమస్కారాలు అక్కడ కనిపిస్తుంటాయి.అయితే స్టాలిన్ సీఎం అయిన తర్వాత అక్కడ పరిస్థితి కొంతవరకు మారింది. అయితే ఏపీలో కూడా ఇటువంటి జాడ్యం ఉండేది. జగన్ సీఎం అయిన తర్వాత ఆ పార్టీ నేతలు ఆయనలో ఒక దేవుడిని చూసేవారు.మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రోజు అయితే.. ఆయన కంటే వయసుకు పెద్దవారు సైతం కాలికి నమస్కారం చేశారు. చేతికి ముద్దులు పెట్టారు. అదో స్వామీజీలా జగన్ ఫీలయ్యేవారు.కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు కనిపించింది.కాలి మీద పడడాలు,సాష్టాంగ నమస్కారాలు వద్దని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం లో చాలామంది నేతలు చంద్రబాబుకు నమస్కారం చేసే ప్రయత్నం చేశారు. కానీ వద్దని వారించారు చంద్రబాబు. అయితే అప్పట్లో చంద్రబాబు ఒక ప్రకటన చేశారు.ఎవరు కాళ్లకు నమస్కారం పెట్టవద్దని..అలా పెడితే తిరిగి పెట్టాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు కొంతవరకు వెనక్కి తగ్గారు. కేవలం చేతితో నమస్కారం వరకే పరిమితం అయ్యారు.
* ఓ వ్యక్తికి షాక్
అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.రాజధానిలో సిఆర్డిఏ భవన నిర్మాణానికిచంద్రబాబు భూమి పూజ చేశారు.పనులను తిరిగి ప్రారంభించారు.ఈ క్రమంలో ఒక వ్యక్తి వచ్చి చంద్రబాబు కాలికి నమస్కారం చేసే ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న చంద్రబాబు వద్దని వారించారు. తిరిగి ఆ వ్యక్తి కాలికి నమస్కారం చేసే ప్రయత్నం చేశారు. దీంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. చంద్రబాబు వ్యవహార శైలి చూసి కంగుతిన్నారు. నమస్కారం పెడితే ఇదే తరహా లో నేను పెడతానంటూ సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు.
* ప్రధాని మోడీ సైతం
అయితే జాతీయస్థాయిలో సైతం ప్రధాని మోదీ ఈ సాష్టాంగ నమస్కారాలకు చెక్ చెప్పారు. వయసుకు పెద్దవారిగా, ఈ దేశానికి ప్రథమ పౌరుడిగా ఉన్న ప్రధాని కాలికి సాధారణంగా నమస్కారం చేసే ప్రయత్నం చేస్తారు. అయితే నేతలకు ఆ అవకాశం ఇవ్వడం లేదు ప్రధాని. వయసుకు అత్యంత చిన్నవారిని సైతం నమస్కరించవద్దని మోడీ సూచించారు. ఏపీ క్యాబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం నాడు చాలామంది మోదీ కాలికి సైతం నమస్కరించే ప్రయత్నం చేశారు. ఆయన వద్దంటూ సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కాలికి నమస్కారం చేసే సంస్కృతికి చెక్ పడుతుండడం విశేషం.