Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆ ప్లాప్ సినిమా ను వదిలిపెట్టి మంచి పని చేశాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకున్నారు. ఇక కొందరు మాత్రమే ఇక్కడ సక్సెస్ సాధిస్తుంటే మరి కొంత మంది మాత్రం ప్లాపులను మూట గట్టుకుంటూ ముందుకు సాగలేక సినిమాలు చేయలేక ఢీలా పడిపోతున్నారు... ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేయాలంటే కొంతమంది స్టార్ హీరోలకు సైతం సాధ్యం కావడం లేదు...

Written By: Gopi, Updated On : October 20, 2024 11:57 am

pawan Kalyan

Follow us on

Pawan Kalyan :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆయన చేసిన సినిమాలతో ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనను తాను స్టార్ హీరో గా కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. .
ఇక మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీకి వచ్చాడు. భారీ సక్సెస్ సాధిస్తూ పవర్ స్టార్ గా కూడా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు స్టార్ హీరోలు ఉండడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక వీళ్ళ తర్వాత రామ్ చరణ్ కూడా వచ్చి ఆయన కూడా స్టార్ హీరో గా మారిన విషయం మనకు తెలిసిందే… ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ మొదట్లో చిరంజీవి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ సినిమాలను ఓకే చేసిన విషయం మనకు తెలిసిందే. ఆయన చేసిన సినిమాల వెనక చిరంజీవి హస్తం కూడా ఉండేది. అందువల్లే పవన్ కళ్యాణ్ చాలా మంచి సినిమాలు చేయడానికి అవకాశం అయితే దక్కింది.

ఇక ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసే సినిమాలన్నింటిని పక్కన పెడుతూ డిఫరెంట్ కథలను ఎంచుకోవాలనే ఉద్దేశ్యంతో మంచి సినిమాలను చేయాలనుకున్నాడు. ఇక అందులో భాగంగానే ఎస్ జె సూర్య డైరెక్షన్ లో వచ్చిన నాని సినిమాని మొదలు పవన్ కళ్యాణ్ చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్నాడు. కానీ చిరంజీవి మాత్రం పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేస్తే ఆడదాని ఆయనతో చెప్పారట.

ఇక దాంతో పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేయాలనే ఆలోచనను విరమించుకున్నాడు. ఇక అప్పుడు సూర్య మహేష్ బాబుతో సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఒక భారీ ఫ్లాప్ మూవీ నుంచి తప్పించుకున్నాడనే చెప్పాలి. మిగలడమే కాకుండా మహేష్ బాబు కెరియర్ లోనే భారీ ఫ్లాప్ గా మూటకటుకుంది. ఇక ఇప్పటివరకు ఆయన కెరియర్ లో వచ్చిన భారీ డిజాస్టర్ సినిమాల్లో నాని మొదటి వరుసలో ఉంటుంది.

ఇక ఇది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చిరంజీవి వల్లే ఈ సినిమా తన మిస్ చేసుకున్నానని అది కూడా తన కెరియర్ కి చాలా వరకు ప్లస్ అయిందంటూ ఒక సందర్భంలో తెలియజేయడం విశేషం…మరి మొత్తానికైతే నాని సినిమా మహేష్ బాబును తీవ్రంగా నిరాశపర్చింది. ఆ సినిమా చేయకపోవడం పవన్ కళ్యాణ్ కు మంచిదైందంటూ సినీ విమర్శకులు సైతం చెబుతూ ఉంటారు…