Pawan – Chandrababu : పవన్ కళ్యాణ్ తో చంద్రబాబుకు ఉన్న భయం అదే

పవన్ తో ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లో ఆలోచన చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ఇవన్నీ చంద్రబాబు భయం మాటునే చేస్తుండడం విశేషం.

Written By: Dharma, Updated On : June 26, 2023 10:11 am
Follow us on

Pawan – Chandrababu : ఈ ఎన్నికల్లో కాస్తా గట్టిగానే కొట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ అందుకు తన శక్తియుక్తులు చాలడం లేదు. అందుకే పవన్ పై ఆధారపడుతున్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత ఒత్తిడిని సైతం ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో భయం సైతం వెంటాడుతోంది. అందుకే నిర్ణయాలు సైతం త్వరగా తీసుకోలేకపోతున్నారు. అచీతూచీ తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి చంద్రబాబుకు ఎన్నోరకాల గుణపాఠాలను నేర్పించింది. కానీ ఆ లోపాలన్నీ అధిగమించి ముందుకెళ్లే క్రమంలో భయం వెంటాడుతోంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందోనన్న బెంగ కలవరపాటుకు గురిచేస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు పవన్ కీలకం. ఆయన లేనిదే ముందడుగు వేయలేని పరిస్థితి. దూరమైన వర్గాలను పవన్ దగ్గర చేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గాన్ని తన వెంట తీసుకొస్తారని నమ్ముతున్నారు. అటు యూత్ ఓటు బ్యాంకు సైతం మల్లుతుందని కాంక్షిస్తున్నారు. ఈ కారణం చేతనే పవన్ తో స్నేహానికి, సంధికి చంద్రబాబు ఆది నుంచి ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ పవన్ అప్పడప్పుడు తన అభిష్టానికి వ్యతిరేకంగా స్టెట్మెంట్లు ఇవ్వడం కూడా చంద్రబాబుకు భయం పుట్టిస్తోంది.

పవన్ తనతో కలిసి రావడంపై కూడా చంద్రబాబు మరోరకంగా భయపడుతున్నారు. పవన్ వస్తూ తన వెంట కాపు సామాజికవర్గానికి తీసుకొస్తారు. అప్పడు బీసీ వర్గాలు తన నుంచి దూరమవుతాయన్న భయం చంద్రబాబును వెంటాడుతోంది. టీడీపీకి బలమైన బీసీ ముద్ర ఉంది. బీసీలు టీడీపీని ఓన్ చేసుకుంటారు. దీనిని గుర్తెరిగే జగన్ బీసీ జపం పఠిస్తున్నారు. బీసీలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు. టీడీపీ నుంచి బీసీలను విడదీస్తే చంద్రబాబుకు దెబ్బ కొట్టవచ్చన్నది జగన్ ప్లాన్. ఇప్పుడు అదే బీసీలు టీడీపీ గూటికి పవన్ కాపుల రూపంలో చేరితే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న భయం చంద్రబాబులో ఉంది.

అయితే ఏది ఎలా ఉన్నా పవన్ కలిసిరావడంతో నష్టం కంటే లాభం అధికం. అది జగమెరిగిన సత్యం. అందుకే పవన్ తో పాటు వచ్చే కాపులు, యువత, టీడీపీతో ఇప్పటివరకూ ఉన్న బీసీలు బయటకు పోకుండా చంద్రబాబు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు సమాచారం. దీనికి ఒక పరిష్కారమార్గంను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ తో ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లో ఆలోచన చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ఇవన్నీ చంద్రబాబు భయం మాటునే చేస్తుండడం విశేషం.