spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawankalyan : పవన్ రాజ్యాధికారానికి ఆ ఒక్కటే అడ్డంకి

Pawankalyan : పవన్ రాజ్యాధికారానికి ఆ ఒక్కటే అడ్డంకి

Pawankalyan : వ్యవస్థలో సమూల మార్పుల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు జనసేనాని పవన్ చెబుతుంటారు. తాను అధికారం, పదవుల కోసం రాలేదని.. వ్యవస్థలో లోపాలు ఎత్తి చూపి పరిష్కార మార్గం కోసమేనంటూ చెప్పుకొస్తుంటారు. అయితే ఈ విషయంలో ఆయన నిబద్ధత, నిజాయితీని శంకించలేం. కానీ అది ఎన్నాళ్లు? ఎన్నేళ్లు? పనిచేస్తుంది. వైసీపీ ఆవిర్భవించి పుష్కర కాలం దాటుతోంది. ఎన్నో ఎత్తూ పల్లాలను చవిచూసిన ఆ పార్టీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. నడిచివచ్చే లక్షలాది మంది గొంతుకులు ఉన్నా.. విజయతీరాల వైపు మాత్రం పార్టీ వెళ్లలేక చతికిలపడుతోంది.

అయితే ఈ పరిణామ క్రమంలో పవన్ చాలా వర్గాలకు దగ్గరయ్యారు. తమ ఆకాంక్షను ఆయా వర్గాలు పవన్ లో చూడడం ప్రారంభించాయి. అందుకే ఆయన ఎక్కడకు వెళ్లిన అంతులేని ప్రజాభిమానం. అయితే దానిని రాజకీయంగా మలుచుకోవడంలో పవన్ ఆశించిన పురోగతి సాధించలేకపోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. స్వాతంత్ర భారతావనిలో రాజ్యాధికారం దక్కని మెజార్టీ సామాజికవర్గం ఒకటి పవన్ ను తమ ప్రతినిధిగా చూస్తోంది. తమ భావితరాలకు రాజ్యాధికార స్ఫూర్తిని ఇస్తోందని ఆశిస్తోంది. అయితే రాజకీయ లాభనష్టాల విషయంలో బాధితుడిగా ఉన్న పవన్ మాత్రం దానిని అందిపుచ్చుకోలేకపోతున్నారు.కుల రాజకీయాలు చేయడం ఇష్టం లేదో తెలియదు.. కానీ సరైన వ్యూహం రచించలేకపోతున్నారు.

ఓ సామాజికవర్గం బలమైన ఆకాంక్షను నెరవేర్చేందుకు అవకాశమున్నా ఎందుకో వెనక్కి తగ్గుతున్నారు. సరైన రాజకీయం చేయలేకపోతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీని కలుపుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా పార్టీల సమూహ యుద్ధంలో తనకు సీఎం  సీటు కష్టమని తెలుసు. పవర్ షేరింగ్ కు ఒప్పుకోరని కూడా తెలుసు. అయినా సాహసానికి దిగడం లేదు. కేవలం బీజేపీతో కలిసి ఒక బలమైన ఆకాంక్ష ఉన్న వర్గాలను ఏకంగా చేసే చాన్స్ ఉన్నా ఆలోచించడం లేదు.  ఈ ఎన్నికల వరకూ బలమైన కూటమిగా మారి.. 2029 ఎన్నికల్లో రాజ్యాధికారం వైపు అడుగులు వేసేందుకు అవకాశం ఉన్నా..ఆ దిశగా రాజకీయాలు చేయడం లేదు. అటువంటి ఆలోచన చేస్తే పవన్ తప్పకుండా సక్సెస్ అవుతారని విశ్లేషకులు సైతం బలంగా చెబుతున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా పవన్ ఆసక్తి చూపకపోవడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper
Exit mobile version