Chandrababu : ఏపీ పోలీస్ డిజిపిగా( AP Police DGP ) ఇటీవల పదవి విరమణ చేశారు ద్వారకా తిరుమలరావు. నమ్మకస్తుడైన అధికారిగా గుర్తింపు ఉండడంతో చంద్రబాబు ఆయన సేవలను గుర్తించారు. పదవీ విరమణ చేసిన వెంటనే ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ప్రజా రవాణా శాఖ కమిషనర్ గా కూడా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేసింది. ఇకనుంచి ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ బస్సులు, బస్టాండ్ల అంశాలతో పాటు ఉద్యోగుల వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తారు. ఏపీఎస్ఆర్టీసీ పాలన వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read : చంద్రబాబు గ్రేట్.. సూపర్ బడ్జెట్.. ఇది ఊహించని ప్రశంస
* మంచి అధికారిగా గుర్తింపు
సమర్థవంతమైన అధికారిగా ద్వారకాతిరుమలరావుకు( Dwaraka Tirumala Rao) పేరు ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆయన ఆర్టీసీఎండిగా ఎంపికయ్యారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిపిగా ఎంపిక చేసింది. జనవరి 31న ఆయన రిటైర్ అయ్యారు. వెంటనే ఆయనను ఆర్టీసీ ఎండీ గా ప్రభుత్వం నియమించింది. ఫిబ్రవరి 1 నుంచి ఏడాది పాటు ఆ బాధ్యతల్లో ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ప్రజా రవాణా కమీషనర్ బాధ్యతలపై క్లారిటీ లేకుండా పోయింది. కార్పొరేషన్ పరిధిలో బస్సులు, ఆస్తులు ఉన్నాయి. పిటిడి పరిధిలో ఉద్యోగులు, సిబ్బంది ఉంటారు. ఆర్టీసీ ఎండీతో పాటుగా పిటిడి కమిషనర్ పోస్టులో ఒక్కరే ఉంటే ఆపరేషన్ తో పాటు అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది ఉండదని ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. దీంతో కూటమి ప్రభుత్వం మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
* లాభాల బాట పట్టిస్తారని..
మొన్నటి వరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ( Kantilal dande) కి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే పాలనా వ్యవహారాల్లో ఇబ్బందులతో పాటు పదోన్నతులకు సంబంధించిన అంశాలపై కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ద్వారకాతిరుమలరావుకు రెండు బాధ్యతలను అప్పగించింది. గతంలో ఆర్టీసీ ఎండిగా పనిచేసిన అనుభవం ఉంది. సంస్థను లాభాల బాటలో నడిపిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. మరి రెండు పోస్టులకు ద్వారకాతిరుమలరావు ఎలా న్యాయం చేస్తారో చూడాలి.
Also Read : మేలో ఆ మూడు పథకాలు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!