Chandrababu : జీవి రెడ్డి (GV Reddy ) తిరిగి తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారా? అందుకు సంకేతాలు పంపిస్తున్నారా? తాజాగా జీవి రెడ్డి చేసిన ట్వీట్ కు కారణం ఏంటి? కొద్దిరోజుల కిందట ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటు టిడిపి సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు జీవి రెడ్డి. ఫైబర్ నెట్ లో నెలకొన్న వివాదంలో సీఎం చంద్రబాబు మందలించడంతోనే మనస్థాపానికి గురై జీవి రెడ్డి రాజీనామా చేసినట్లు ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు అదే చంద్రబాబును పొగుడుతూ జీవి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
* పొగుడుతూ పోస్ట్
కొద్దిరోజుల కిందట తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి గుడ్ బై చెప్పారు జీవి రెడ్డి. ఏ రాజకీయ పార్టీలో చేరడానికి కూడా తేల్చి చెప్పారు. అయితే ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబును పొగుడుతూ ఒక ట్విట్ చేశారు. తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం 33 వేల కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతో రూపొందించారు. మూడు లక్షల 22 వేల కోట్ల భారీ బడ్జెట్ ను ప్రణాళిక బద్దంగా ప్రవేశపెట్టారని కొనియాడారు. తాను వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందని పోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా తక్కువ కాలంలోనే టిడిపిలోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ చంద్రబాబుకు రుణపడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం కోసం 2029లో కూడా మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యతగా గుర్తు చేశారు జీవీ రెడ్డి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read : మేలో ఆ మూడు పథకాలు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!
* క్లిష్ట సమయంలో టిడిపిలో చేరిక
2019లో తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. చాలామంది టిడిపి నేతలు బయటకు వెళ్లిపోయారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. అటువంటి సమయంలోనే తెలుగుదేశం పార్టీలో చేరారు జీవి రెడ్డి. గత ఐదేళ్లుగా పార్టీ వాయిస్ గట్టిగా వినిపిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచేవారు. చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించేవారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీ రెడ్డికి ఏపీ ఫైబర్ నెట్ పదవి ఇచ్చారు చంద్రబాబు. కానీ అక్కడ ఎం.డితో తలెత్తిన విభేదాలతో జీవి రెడ్డి పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు.
Also Read : చంద్రబాబు ఇంటి పై దాడి.. జోగి రమేష్, దేవినేని పిటిషన్ పై సుప్రీం కీలక ఆదేశాలు!
* టిడిపి శ్రేణుల్లో అసంతృప్తి
అయితే జీవి రెడ్డి(GV Reddy ) రాజీనామాను టిడిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. మళ్లీ జీవి రెడ్డిని టిడిపిలోకి తెచ్చి మంచి పదవి ఇవ్వాలని కోరాయి. అందుకు నాయకత్వం సైతం పావులు కదిపినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు పార్టీలోకి వస్తే తన వ్యక్తిత్వం పై ప్రభావం పడుతుందని జీవి రెడ్డి భయపడినట్లు తెలుస్తోంది. అయితే తాజా ట్విట్ తో జీవి రెడ్డి మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆయన టిడిపిలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ. 3 లక్షల 22 వేల కోట్ల బారి బడ్జెట్ను ప్రణాళికబద్ధంగా రూపొందించారు.
నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల…
— G V Reddy (@gvreddy0406) March 1, 2025