CM Chandrababu: తెలంగాణపై చంద్రబాబు కన్ను.. టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేలా స్కెచ్‌!

చంద్రబాబు పర్యటన వెనుక అనేక వ్యూహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అధికారికంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై చర్చిండంతోపాటు మరోవైపు తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని భావిస్తున్నారు.

Written By: Dharma, Updated On : July 5, 2024 12:15 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జూలై 5న తెలంగాణకు వస్తున్నారు. అధికారిక పర్యటనే అయినా ఆయన తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు. దీంతో సీఎం హోదాలో తెలంగాణకు వస్తున్న చంద్రబాబు నాయకుడుకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఇంటి వరకు బైర్‌ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. జూలై 7న హైదరాబాద్‌లో పార్టీనేతల ఆత్మాయ సమ్మేళనానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

అసలు ప్లాన్‌ అదే..
చంద్రబాబు పర్యటన వెనుక అనేక వ్యూహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అధికారికంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై చర్చిండంతోపాటు మరోవైపు తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని భావిస్తున్నారు. త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ్ముళ్లను పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారు. ఏపీ సీఎం అయిన తర్వాత తెలంగాణలో కూడా పార్టీ కార్యక్రమాలకు చంద్రబాబు ప్రోత్సాహం అందిస్తారని తెలుగు తమ్ముళ్లు కూడా భావిస్తున్నారు.

పసుపు మయమైన భాగ్యనగరం..
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌ను టీడీపీ శ్రేణులు పసుపు మయం చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి పంజాగుట్ట, జూబ్లిహిల్స్‌ వరకు పసుపు తోరణాలు, స్వాగత ఫ్లెక్సీలతో నింపేశారు. ఇక ఆదివారం నిర్వహించే టీడీపీ ఆత్మీయ సమ్మేళనంలో టీటీడీపీ అధ్యక్షుడి ఎన్నిక, పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించిన వ్యూహాలపై చర్చిస్తారని తెలుస్తోంది.

తెలంగాణలో పూర్వ వైభవం సాధ్యమేనా..
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లా తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబునాయుడు ఏపీకే పరిమితమయ్యారు. తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాలకు విభజన చట్టం ప్రకారం జరగాల్సిన పంపకాలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారంపై చొరవ చూపిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ పార్టీ బలోపేతంపైనా దృష్టిపెట్టారు. అయితే సరైన నాయకుడు లేకుండా తెలంగాణలో టీడీపీ బలపడడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చంద్రబాబు పార్టీ బలోపేతానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి.