SS Rajamouli: రాజమౌళికి SS, తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు KV, కీరవాణికి MM.. వీరి పేర్ల వెనుక కథ?

కళ్యాణ్ మాలిక్ కూడా కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. వీరికి తర్వాత సోదరుడు కోడూరి విజయేంద్రప్రసాద్. ఇందులో చివరి సోదరుడు కోడూరి రామకృష్ణ. మరోవైపు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.

Written By: Swathi Chilukuri, Updated On : July 5, 2024 12:20 pm

SS Rajamouli

Follow us on

SS Rajamouli: కీరవాణి, రాజమౌళిల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరు అన్నదమ్ములు. అయితే రాజమౌళి పేరుకు ముందు SS ఉంటే.. కీరవాణి పేరుకు ముందు మాత్రం MM కీరవాణి అని ఉంటుంది. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ పేరుకు ముందు మాత్రం KV అని ఉంటుంది. తండ్రి కొడుకుల ఇంటి పేరు వేరుగా ఉండటం ఏంటి అని కన్ఫ్యూషన్ అవుతున్నారా? ఈ ఆర్టికల్ లో వీటిని క్లియర్ చేసుకోండి.

వీరి ఇంటి పేరు కోడూరి. రాజమౌళి వాళ్ల కుటుంబం లో మొదటి సోదరుడు కోడూరి రామారావు, తర్వాత కోడూరి శివశక్తి దత్తా, ఆయన తర్వాత కోడూరి కాశి అని సమాచారం. అయితే కోడూరి శివశక్తి దత్తా కుమారుడు కీరవాణి. ఆయన మరెవరో కాదు చంద్రహాస్ సినిమా కి దర్శకత్వం వహించింది ఈయననే. అయితే కీరవాణి కి కళ్యాణ్ మాలిక్ అనే మరో సోదరుడు ఉన్నాడు. ఇదిలా ఉంటే కోడూరి కాశీ కీరవాణి ని సంగీత దర్శకుడు చక్రికి పరిచయం చేశారట. దీంతో కీరవాణికి సంగీత దర్శకుడిగా అవకాశం లభించింది.

కళ్యాణ్ మాలిక్ కూడా కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. వీరికి తర్వాత సోదరుడు కోడూరి విజయేంద్రప్రసాద్. ఇందులో చివరి సోదరుడు కోడూరి రామకృష్ణ. మరోవైపు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. ఈయన గురించి పరిచయం అవసరం లేదు. మెర్సల్, భజరంగీ భాయిజాన్, మణికర్ణిక, తలైవి వంటి హిట్ సినిమాలకు కథను అందించారు. కుమారుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకి కథాసహకారం చేశారు తండ్రి. ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకి కూడా కథను అందించారు విజయేంద్రప్రసాద్.

అయితే రాజమౌళి పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి. జక్కన్న ముందుండే ఎస్ ఎస్ అక్షరాలకి అర్థం శ్రీశైల శ్రీ అట. కీరవాణి పూర్తి పేరు మరకతమణి కీరవాణి అంటే ఇందులోని మరకతమణిని ఎంఎంగా సూచిస్తారు. వీరి కుటుంబం మొత్తంలో ఇంటిపేరు ఉపయోగించింది కళ్యాణ్ మాలిక్ ఒక్కరే అని సమాచారం. ముందు కళ్యాణ్ మాలిక్ అని ఉండే పేరు తర్వాత కల్యాణి కోడూరి గా మార్చుకున్నారు.

ఇక వీరికి ఒకే ఒక చెల్లెలు. ఆమనే ఎం ఎం శ్రీలేఖ. ఈమె కీరవాణి కి చెల్లెలు అవుతారు. శ్రీలేఖ కూడా అదిరిందయ్యా చంద్రం, ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాలకు సంగీతం అందించింది. శ్రీలేఖ పూర్తి పేరు మణిమేఖల శ్రీలేఖ అని తెలుస్తోంది. ఈమె కూడా తన ఇంటి పేరును పెట్టుకోలేదు.

ఈ జనరేషన్ మాత్రమే కాదు కీరవాణి కుమారుడు కూడా తన ఇంటి పేరును స్క్రీన్ నేమ్ గా పెట్టుకోలేదు. యమదొంగ లో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించిన సింహ కోడూరి గుర్తు ఉన్నాడా? ఈయన మత్తు వదలరా సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈయనే కీరవాణి కొడుకు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు అయినా తమ ఇంటి పేరును మాత్రం పేరుకు ముందు పెట్టుకోలేదు.