CM Chandrababu : ఆంధ్రా మహిళలకు మరో గొప్ప వరమిచ్చిన చంద్రబాబు

దీపావళి నుంచి దీపం పథకాన్ని ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఇంటా గ్యాస్ వినియోగం పెరగాలని అప్పట్లో టిడిపి ప్రభుత్వం దీపం పథకం ప్రవేశ పెట్టింది. ఇప్పుడు అదే పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించేందుకు నిర్ణయించింది.

Written By: Dharma, Updated On : October 22, 2024 11:18 am

CM Chandrababu

Follow us on

CM Chandrababu :  ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసింది. కూటమి గెలిస్తే మహిళలకు ఉచిత గ్యాస్అందిస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ పథకానికి శ్రీకారం చుట్టం అన్నారు సీఎం చంద్రబాబు. తాజాగా ఈ పథకం అమలుపై మార్గదర్శకాలను రూపొందించే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. సోమవారం మంత్రి నాదెండ్ల మనోహర్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమీక్షించారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహిళల కోసం దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీపం పథకంతో ఈ దీపావళి పండుగ ఇళ్లల్లో వెలుగులు తెస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు మహిళలను టార్గెట్ చేసుకున్నారు. వారికోసం ప్రత్యేక పథకాలు ప్రకటించారు. ముఖ్యంగా పెరిగిన వంట గ్యాస్ ధరతో మహిళలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా.. పాము అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. మహిళల్లో ఒక రకమైన ఆలోచన తెచ్చింది. కూటమి ఏకపక్ష విజయానికి ఇదొక కారణంగా మారింది. అయితే ఈ పథకం అమలులో ఎటువంటి జాప్యం చేయకూడదని చంద్రబాబు సర్కార్ భావించింది. ఇప్పటికే ప్రత్యేకమైన ప్రకటన జారీ చేసింది. మరో వారం రోజుల్లో ఈ పథకం అమలు చేసేలా కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు సీఎం చంద్రబాబు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ పథకం వర్తింప చేస్తామని ప్రకటించారు.

* కుటుంబానికి రూ.2500 లబ్ధి
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల ముప్పై రూపాయలుగా ఉంది. ప్రతి కుటుంబానికి ఒక గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కచ్చితంగా ఉంటుంది. ఈ లెక్కన ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లభారం 2500 రూపాయల వరకు పడుతుంది.ముఖ్యంగా పండగ సమయంలో గ్యాస్ వినియోగం అధికంగా ఉంటుంది. అదే సమయంలో ఉచితంగా గ్యాస్ అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ దీపావళి నుంచి పథకానికి శ్రీకారం చుట్టనుంది. గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన తర్వాత చంద్రబాబు ఈ విషయంలో పూర్తి స్పష్టతనిచ్చారు. అర్హులైన కుటుంబాలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చెప్పారు. మహిళలందరికీ పారదర్శక విధానంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడం జరుగుతుందని తెలిపారు.

* ఈ నెల 24 నుంచి బుకింగ్ సదుపాయం
అక్టోబర్ 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం కానుంది. అయితే అక్టోబర్ 24 నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. కానీ అక్టోబర్ 31 నుంచి సిలిండర్ల పంపిణీ మొదలుకానుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్ధిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ కానుంది. కాగా మహిళలకు ఇంటి ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతోనే అప్పట్లో దీపం పథకం ప్రవేశపెట్టింది టిడిపి ప్రభుత్వం. మరోసారి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి అదే పేరుతో పథకం ప్రారంభించడం విశేషం. ప్రస్తుతంరిటైల్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ధర 876 రూపాయలుగా ఉంది. ప్రతి సిలిండర్ కు కేంద్ర ప్రభుత్వం 25 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. దీంతో సిలిండర్ ధర ఎనిమిది వందల యాబై ఒక్క రూపాయి గా ఉంది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం ద్వారా ప్రభుత్వం పై 2684 కోట్ల రూపాయల భారం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే ఐదేళ్లలో ఈ పథకానికి అయ్యే ఖర్చు 13,423 కోట్లు. మొత్తానికి అయితే ఒక ఎన్నికల హామీని అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేయడం విశేషం