https://oktelugu.com/

Kodali Nani : ఎలాంటి కొడాలి నాని..ఎలా అయ్యారు? గుడివాడలో పరిస్థితి చూస్తుంటే!

నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం గుడివాడ.కానీ గుడివాడ అంటేనే ముందుగా గుర్తొచ్చే పేరు కొడాలి నాని. అటువంటి కొడాలి నాని ఒకే ఒక ఓటమితో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 22, 2024 / 11:25 AM IST

    Kodali Nani

    Follow us on

    Kodali Nani : కొడాలి నాని.. వైసిపి ఫైర్ బ్రాండ్లలో ఒకరు. ఆయన మాట తూటాలా పేలుతుంది.ప్రత్యర్ధులకు ఎక్కడ తాకాలో అక్కడ తాకుతుంది.కానీ అదంతా నిన్నటి వరకు.నిన్నటి ఎన్నికల వరకు.వరుసగా గుడివాడ నుంచి గెలుస్తూ వస్తున్న కొడాలి నాని..ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు. అప్పటినుంచి అడపాదడపా తప్పించి.. పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు. అప్పుడప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వద్ద మెరుస్తున్నారు.కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం కనిపించడం లేదు.ఇప్పటికే ఆయనపై గెలిచిన ఎన్నారై వెనిగండ్ల రాము దూకుడుతో ముందుకు సాగుతున్నారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని స్వాధీనంలో ఉన్న ఆస్తులకు విముక్తి కల్పిస్తున్నారు.పాత యజమానులకు అప్పగిస్తున్నారు.నియోజకవర్గ ప్రజలతో మమేకం అయి పని చేస్తున్నారు.దీంతో కొడాలి నాని దూకుడుకు బ్రేక్ పడింది. నాని మాటలు వినే యంత్రాంగం ఇప్పుడు లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితిగా మారింది. గత 20 సంవత్సరాలుగా కొడాలి నాని అంటే గుడివాడ.. గుడివాడ అంటే కొడాలి నాని అన్నట్టు పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను కొడాలి నాని ఎదుర్కోవాల్సి వస్తోంది.

    * టిడిపి ద్వారా ఎంట్రీ
    తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కొడాలి నాని. 2004 ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.2009లో సైతం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఆయన జగన్ వెంట నడిచారు.2014,2019 ఎన్నికల్లో సైతం విజయం సాధించి సత్తా చాటారు.టిడిపి ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన కొడాలి నాని.. అదే టిడిపి అధినేత చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. గత ఐదేళ్లుగా ఆయన చేయని వ్యాఖ్య అంటూ లేదు. అందుకే చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేసి కొడాలి నానిని ఓడించాలని భావించారు. ఎన్నారై వెనిగంట్ల రాముడు రంగంలోకి దించి కొడాలి నాని దూకుడుకు కళ్లెం వేశారు.

    * విపక్షంలో ఉన్న.. మాట నెగ్గింపు
    2004,2009,2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని..ప్రతిపక్షంలోనే ఉన్నారు. అయినా సరే గుడివాడ విషయంలో తన మాట నెగ్గించుకున్నారు. ఆయన విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా.. పాలక పక్షం టచ్ చేయలేనంత బలాన్ని సాధించారు. 2019 ఎన్నికల్లో మంత్రి అయ్యేసరికి తన బలాన్ని, బలగాన్ని పెంచుకున్నారు.మరింత బలోపేతం అయ్యారు. అయితే ఒకే ఒక ఓటమి ఆయనకు ఎదురయ్యేసరికి సీన్ మారింది. ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు. ఘనంగా నిర్వహించుకోవాలని అనుచరులు భావించారు. కానీ ఎటువంటి వేడుకలు జరుపుకోవాలని.. ఫ్లెక్సీలు కట్టవద్దని పోలీస్ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి కొడాలి నాని.. ఎలా అయ్యారు అంటూ గుడివాడ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.