Chandrababu : ఏపీలో( Andhra Pradesh) 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఈనెల 10తో ముగిసింది. కేవలం ఐదుగురు మాత్రమే నామినేషన్లు వేయడంతో వారంతా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంఛనమే. చాలా రోజుల కిందట జనసేన నేత నాగబాబు నామినేషన్ వేశారు. సోమవారం టిడిపి తరఫున బీదా రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ నామినేషన్లు వేస్తారు. అయితే మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తుందనగా.. 14 నిమిషాలు గడువు ఉందనగా బిజెపి అభ్యర్థి సోము వీర్రాజు నామినేషన్ వేశారు.
Also Read : నామినేటెడ్ లిస్టు సిద్ధం.. టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు, లోకేష్ గుడ్ న్యూస్
* ఎంపిక అనూహ్యం
అయితే సోము వీర్రాజు( Veer Raju ) ఎంపిక అనూహ్యమని తెలుస్తోంది. ఆయనపై టిడిపి వ్యతిరేక ముద్ర ఉంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి తో పొత్తు వద్దన్న నాయకుల్లో సోము వీర్రాజు ముందుండేవారు. బిజెపి రాష్ట్ర చీఫ్ గా ఉండే సమయంలో వీర్రాజు టిడిపి పై విరుచుకుపడేవారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్క క పోవడానికి అదే ప్రధాన కారణం. అయితే ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం ఉంది. కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఈ సమయంలో సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి అంటే.. చంద్రబాబు తప్పకుండా అభ్యంతరం చెప్పి ఉంటారు. లేకుంటే చంద్రబాబుతో సోము వీర్రాజు రాజీ పడైనా ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉండాలి.
* కుదరని ఏకాభిప్రాయం
ఆదివారం రాత్రి వరకు బిజెపి అభ్యర్థి( BJP candidate) విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఉత్తరాంధ్రకు చెందిన పివిఎన్ మాధవ్, గోదావరి జిల్లాలకు చెందిన పాక సత్యనారాయణ, తపన్ చౌదరి మధ్య పదవి కోసం గట్టిగానే పోటీ జరిగింది. పురందేశ్వరి నివాసంలో పార్టీ ముఖ్యంగా భావిస్తున్న సీఎం రమేష్, సుజనా చౌదరి.. ఇలా నేతలంతా సమావేశం అయ్యారు. అయితే ఏకాభిప్రాయానికి రాకపోవడంతో పురందేశ్వరి ఈ నలుగురి జాబితాలను హై కమాండ్ కు పంపించారు. హై కమాండ్ మాత్రం సోము వీర్రాజు వైపు మొగ్గుచూపింది. అయితే ఇది చంద్రబాబుకు తెలియకుండా జరిగింది మాత్రం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* సీనియర్ మోస్ట్ లీడర్
సోము వీర్రాజు( Veer Raju) సీనియర్ మోస్ట్ లీడర్. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. బిజెపి హై కమాండ్ కుల సమీకరణను పరిగణలోకి తీసుకునే ఆయనకు బిజెపి చీఫ్ పదవి ఇచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం సోము వీర్రాజు అడ్డగోలుగా వ్యవహరించారు. అందుకు మూల్యం చెల్లించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా దక్కలేదు. అయితే ఈ పరిణామాలను గమనించిన సోము వీర్రాజు చంద్రబాబుతో రాజీకి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అందుకే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
Also Read : ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ ముగ్గురు.. చంద్రబాబు సంచలనం.. ఆ నిర్ణయాలు వెనుక కారణం అదే!