https://oktelugu.com/

Game Changer : కర్ణాటకలో కేవలం ఫ్యాన్స్ షోస్ నుండి ‘గేమ్ చేంజర్’ ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో తెలుసా..? సెన్సేషనల్ రికార్డ్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్'(Game changer ) మూవీ రెండు తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : January 6, 2025 / 04:32 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్'(Game changer ) మూవీ రెండు తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మంచి ఊపు మీద వెళ్తుంది. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 1 మిలియన్ గ్రాస్ వసూళ్లకు పైగా ప్రీ సేల్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఇంకా అనేక ఓవర్సీస్ ప్రాంతాలలో ఐమాక్స్ మరియు ఇతర ఫార్మట్స్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. వాటి కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అవి ప్రారంభం అయ్యాక కచ్చితంగా ఈ చిత్రం ఓవర్సీస్ గ్రాస్ భారీ రేంజ్ లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ కి అనుమతిని ఇచ్చింది.

    కానీ తెలంగాణాలో మాత్రం ఈ సినిమాకి టికెట్ హైక్స్ ఇస్తారా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యాక తెలంగాణ టికెట్ హైక్స్ మరియు బెనిఫిట్ షోస్ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందట. తెలంగాణ లో ఆ విషయం తేలే వరకు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టకూడదని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. తెలుగు రాష్ట్రాల సంగతి కాసేపు పక్కన పెడితే కర్ణాటక లో ఈ చిత్రానికి సంబాణిధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. పూర్తి స్థాయి బుకింగ్స్ ని ప్రారంభించకుండా కేవలం ఉదయం 6 గంటల షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో మొదలు పెట్టారు. రెస్పాన్స్ అదిరిపోయింది. కేవలం 20 థియేటర్స్ నుండే 18 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

    ఇక పూర్తి స్థాయిలో అన్ని సింగిల్ స్క్రీన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెడితే కేవలం ఫ్యాన్స్ షోస్ నుండే కోటి రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ షోస్ కి టికెట్ ధర 600 రూపాయిల వరకు ఉంది. మిగతా రెగ్యులర్ షోస్ కి మామూలు రేంజ్ రేట్స్ కొనసాగుతున్నాయి. దేవర చిత్రానికి మొదటి రోజు కర్ణాటక లో 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. గేమ్ చేంజర్ చిత్రానికి కూడా ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. అన్ని కలిసి వస్తే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల తర్వాత తమిళనాడు లో అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అందుకొని వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరుతుందా లేదా అనేది చూడాలి.