AP Intermediate: ఏపీలో ఇంటర్ విధానంలో కీలక మార్పులు రానున్నాయి. సిలబస్ తో పాటు పరీక్షల నిర్వహణపై( exams conduct ) ప్రభుత్వానికి సరికొత్త ప్రతిపాదనలు అందాయి. సీబీఎస్ఈ( CBSE) తరహాలో రెండేళ్ల కోర్సులో ఒక్కసారి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. తొలి ఏడాది పరీక్షలను ఇంటర్నల్ గా( internal) నిర్వహించాలని.. రెండో ఏడాది మాత్రమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది ఇంటర్ బోర్డు. అలాగే కొత్తగా ఎం బైపీసీ( M bipc) గ్రూపును ప్రవేశపెట్టనుంది. ప్రధానంగా సిలబస్ లో మార్పునకు శ్రీకారం చుట్టనుంది. ఇటీవలే ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంటర్ బోర్డు కీలక ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. సీబీఎస్ఈ తరహాలోనే ఇంటర్ కోర్సులు ఉండేలా ప్లాన్ చేస్తోంది.
* సీబీఎస్ఈ తరహాలో
సిబిఎస్ఈ( CBSE) విధానంలో 11వ తరగతికి పబ్లిక్ పరీక్షలు ఉండవు. 12వ తరగతికి( 12th class) మాత్రమే ఉంటాయి. దీంతో ఇంటర్ పరీక్షల్లోనూ ఇదే విధానం అమలు చేయాలని ఇంటర్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదించింది. జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కూడా 12వ తరగతి మార్కులను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో ఇంటర్ రెండో సంవత్సరంలో పబ్లిక్ పరీక్షలు ఉంటే చాలు అని ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు పంపింది ప్రభుత్వానికి. ఫస్ట్ ఇయర్ లో పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తూ.. ఇంటర్నల్ పరీక్షలకు మాత్రమే పరిమితం కావాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే ఈ ప్రతిపాదనలపై కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది. త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
* ప్రజాభిప్రాయ సేకరణ
అయితే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే విమర్శలు చుట్టుముట్టే అవకాశం ఉంది. అందుకే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ( opinion pol) చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈనెల 26 వరకు దీనిపై ప్రజాభిప్రాయాలు సేకరించనుంది. రెండు సంవత్సరాలకు ఒక్కసారి పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులకు చదువుకునేందుకు ఎక్కువ సమయం లభించే అవకాశం ఉంది. తద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని.. ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే వచ్చే ఏడాది నుంచి సిలబస్లో భారీగా మార్పులు తేవాలని కూడా ఆలోచన చేస్తోంది. విద్యా సంవత్సరం విషయంలో కూడా ఒక నిర్ణయానికి రానుంది.
* ముందుగానే వేసవి సెలవులు
సాధారణంగా ఇంటర్ విద్యార్థులకు జూన్ 1 నుంచి విద్యా సంవత్సరం( educational year ) ప్రారంభం అవుతుంది. మార్చితో ముగుస్తోంది. ఏప్రిల్ తో పాటు మే నెలలో వేసవి సెలవులు ఇస్తున్నారు. ఇకపై ఈ సెలవులను విద్యాసంవత్సరం మధ్యలోకి తేవాలని ఇంటర్ బోర్డు ( inter board) భావిస్తోంది. మార్చితో విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే.. ఏప్రిల్ నుంచి తిరిగి మొదలయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి 24 వరకు తరగతులు నిర్వహిస్తారు. మిగతా ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా 24 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. తిరిగి జూన్ 1 నుంచి కాలేజీలు తెరిచేలా క్యాలెండర్ సిద్ధం చేస్తున్నారు. తద్వారా వేసవి సెలవులకు ముందు పూర్తిచేసిన సిలబస్ నుంచి.. బోధన కొనసాగించేలా ఉంటుందని ప్రతిపాదన సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది ఇంటర్ బోర్డు. దీనిపై పూర్తిస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ఒక నిర్ణయానికి రావాలని ప్రభుత్వం భావిస్తోంది.