Homeజాతీయ వార్తలుSushila Meena: సచిన్ మెచ్చిన లేడీ బౌలర్.. కేంద్ర మంత్రిని తొలి బంతికే క్లీన్ బౌల్డ్...

Sushila Meena: సచిన్ మెచ్చిన లేడీ బౌలర్.. కేంద్ర మంత్రిని తొలి బంతికే క్లీన్ బౌల్డ్ చేసింది.. వైరల్ వీడియో

Sushila Meena: శివంగిలాగా బౌలింగ్ చేసే ఆ బాలిక పేరు సుశీలా మీనా(Sushila Meena) ఈమె టాలెంట్ ను సోషల్ మీడియా వేదికగా దిగ్గజ ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) వెలుగులోకి తెచ్చాడు. దీంతో ఆనాటి నుంచి సుశీలా మీనా(Sushila Meena) సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ అయింది. ఈమె గురించి చాలామంది ఆరా తీయడం మొదలుపెట్టారు. అలా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. సుశీలా మీనా రాజస్థాన్ రాష్ట్రంలో పేద కుటుంబంలో జన్మించింది. అయినప్పటికీ క్రికెట్ మీద ఆమెకు విపరీతమైన ఇష్టం. అందువల్లే అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో తన టాలెంట్ ను నిరూపించుకుంది. అయితే ఆ అమ్మాయి చేస్తున్న బౌలింగ్ సచిన్ టెండూల్కర్ కు ఆసక్తి కలిగించింది. అందువల్లే ఆమె బౌలింగ్ చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. అది కాస్త మిలియన్ వ్యూస్ సొంతం చేసుకు. దీంతో ఒక్కసారిగా ఆమె గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలో పర్యటించారు. ఆ సమయంలో సుశీల తో సరదాగా క్రికెట్ ఆడారు. సుశీల వేసిన ఒక బంతి రాజ వర్ధన్ సింగ్ రాథోడ్ బ్యాట్ మధ్యలో నుంచి వెళ్లి వికెట్లను పడగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో పెను సంచలనంగా మారింది.

ఉచితంగా శిక్షణ

సుశీలలో ఉన్న ప్రతిను చూసిన రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(Rajasthan cricket association) ఆమెకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి అయ్యే ఖర్చును మొత్తం రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ భరిస్తోంది. సుశీలలో అద్భుతమైన ప్రతిభ ఉందని.. ఆ ప్రతిభకు సరైన శిక్షణ తోడైతే ఆమె అద్భుతంగా రాణిస్తుందని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ” సుశీల వయసు చిన్నదే. అయినప్పటికీ ఆమె బౌలింగ్ వేసే విధానం అద్భుతం. అందువల్లే సచిన్ టెండూల్కర్ మనసును చూరగొన్నది. తన ఏకంగా ఆమె వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె బౌలింగ్ వేసే విధానం ఎంత నచ్చితే సచిన్ ఆ పని చేశారో అర్థం చేసుకోవచ్చు. సుశీలకు ఇదేవిధంగా ట్రైనింగ్ ఇస్తే ఆమె భవిష్యత్ కాలంలో టీమిండియా మహిళల జట్టును కచ్చితంగా లీడ్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఆమె మట్టిలో పుట్టిన మాణిక్యం. కచ్చితంగా క్రికెట్ కు సరికొత్త సొబగులు అద్దుతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదని” మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version