spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan: ఇదేందయ్యా ఇదీ.. జగన్ వీడియోలతో ఆపరేషనా?

Jagan: ఇదేందయ్యా ఇదీ.. జగన్ వీడియోలతో ఆపరేషనా?

Jagan: సాధారణంగా మత్తుమందు ఇచ్చి.. శరీరంలో మత్తు పంపించి ఆపరేషన్ చేస్తారు. ఈ ప్రక్రియలో మత్తు వైద్యుడు కూడా కీలకం. కానీ ఓ వ్యక్తిని కనీసం మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేశారు. ఇందుకు జగన్ బొమ్మను వినియోగించుకున్నారు. జగన్ ప్రమాణస్వీకారం వీడియోను చూపించి ఆపరేషన్ చేశారు. వింతగా ఉంది కదూ. మీరు వింటున్నది నిజమే. ఫిట్స్ తో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆపరేషన్ చేసే క్రమంలో ఈ ఆసక్తికరమైన పరిణామం బయటపడింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా ఇసుక త్రిపుర వరానికి చెందిన ఆంజనేయులకు ఏపీ సీఎం జగన్ అంటే వల్లమాలిన అభిమానం. జగన్ కు ఆయన వీరాభిమాని. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆయన ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన మెదడులో 7 cm సైజులో ట్యూమర్ ఏర్పడినట్లు డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్ అవసరమని చెప్పారు. దీంతో ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించాడు. అయితే ఆ కణితి సున్నిత భాగంలో ఉండడంతో మత్తుమందు ఇస్తే ప్రమాదమని వైద్యులు భావించారు. నీకు ఇష్టమైన నాయకుడు ఎవరని వైద్యులు అడిగారు. నాకు సీఎం జగన్ అంటే అభిమానమని.. హీరో కృష్ణ అన్న తనకు ఎంతో ఇష్టమని.. ఆయన నటించిన అగ్నిపర్వతం సినిమాను ఎన్నోసార్లు చూశానని చెప్పుకొచ్చాడు.దీంతో డాక్టర్లు ఆలోచన చేశారు.

మత్తుమందు ఇవ్వకుండా ఆపరేషన్ చేయడం కుదరదు. అలాగని మత్తు ఇస్తే ప్రాణానికి ప్రమాదం. అందుకే వైద్యులు కొత్త ఆలోచన చేశారు. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో దృశ్యాలను, కృష్ణ నటించిన అగ్నిపర్వతం సినిమాను లాప్ టాప్ లో ప్రదర్శించారు. దానిని చూపించి ఆపరేషన్ పూర్తి చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని వైద్యులే స్వయంగా ధ్రువీకరించారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సరిగ్గా ఎన్నికల ముంగిట ఇటువంటి వార్త వైసీపీ సోషల్ మీడియాకు ఒక వరంగా మారింది. తెగ ట్రోల్ చేస్తున్నారు. వైఎస్ జగన్ మేనియా ఇది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper