Pushpa Keshava: అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటించే ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్ లుగా నిలుస్తుంటాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూ తన సత్తా చాటుతున్నారు బన్నీ. రీసెంట్ గా ఆయన నటించిన పుష్ప సినిమా సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకుంది. చిత్తూరు యాసలో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. సాంగ్స్, డైలాగ్స్ ప్రతి ఒక్క అంశం కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ తో పార్ట్ 2ను కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన బన్నీ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. పుష్ప లో నటించినందుకు గానూ నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు బన్నీ. నేషనల్ అవార్డు రావడంతో చిత్ర బృందంపై మరింత బాధ్యతలు ఎక్కువగా పెరిగాయి. దీంతో పుష్ప 2 సినిమా పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రావడానికి సిద్దమవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కేశవ పాత్రలో నటించిన నటుడు అరెస్ట్ అయ్యారట.
ఆయన అరెస్ట్ తో సినిమా వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై చిత్ర బృందం రీసెంట్ గా క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే బన్నీ డిజిటల్ టీం ఈ వార్తలపై స్పందిస్తూ.. అనుకున్న సమయానికి పుష్ప రాజ్ ర్యాంపేజ్ వస్తుందంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు అటు సుకుమార్ కూడా ఈ సినిమా విడుదలపై స్పందించారు.
పుష్ప రాజ్ రూల్స్ ప్రారంభం కానున్నాయంటూ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్లు వైరల్ గా మారాయి. దీంతో పుష్ప 2 సినిమా వాయిదా పడుతుందనే వార్తలకు చెక్ పెట్టినట్టుగా అయింది. ఈ వార్తను విన్న బన్నీ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.