Nara Lokesh Birthday: ఏపీ మంత్రి నారా లోకేష్( AP Minister Nara Lokesh )జన్మదిన ఈరోజు. పలువురు ప్రముఖులు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు నారా లోకేష్. అక్కడ ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యారు. సోషల్ మీడియా వేదికగా లోకేష్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. లోకేష్ పై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం నారా బ్రాహ్మణి సోషల్ మీడియా పోస్టు వైరల్ అవుతోంది.
* ఎంతో ప్రేమతో..
ప్రపంచ పెట్టుబడుల సదస్సు దావోస్ లో( davos ) జరుగుతున్న సంగతి తెలిసిందే. కార్యక్రమానికి హాజరయ్యారు లోకేష్. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు బ్రాహ్మణి.’ నా బలం, నా ప్రశాంతత అయిన లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు పడుతున్న కష్టం, చేస్తున్న త్యాగాలు, మోస్తున్న బాధ్యతలను నేను నిత్యం గమనిస్తూనే ఉన్నాను. ఇవన్నీ మీరు ఎంతో నిశ్శబ్దంగా చేస్తూ ఉంటారు. సమాజంలో మార్పు తీసుకురావాలని మీ నిబద్దత మా అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ ఏడాది మీకు ఎంతటి పని ఒత్తిడిలోనైనా ప్రశాంతమైన క్షణాలు లభించాలని కోరుకుంటున్నాను. మీ వెంటే నడుస్తున్నందుకు నేను ఎప్పుడూ గర్వపడుతుంటాను ‘.. అని పోస్ట్ చేశారు నారా బ్రాహ్మణి.
* ప్రముఖుల అభినందనలు..
మరోవైపు నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. విద్యావ్యవస్థలో భావితరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పు తీసుకురావడంలో, ఐటీ సంస్థల ఏర్పాటులో, యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడంలో మంచి పనితీరు కనబరుస్తున్నారంటూ అభినందించారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకత్వం అంటే కేవలం పదవి కాదు ఒక నిరంతర బాధ్యత అన్నట్టు లోకేష్ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు అనిత. లోకేష్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Happy Birthday to my strength and my calm @naralokesh ! I see the long days, the sacrifices, and the weight you carry – often silently. Your commitment to making a difference inspires all of us. May this year give you moments of peace amid the hustle. Always proud to walk beside… pic.twitter.com/0Haias8fhv
— Brahmani Nara (@brahmaninara) January 23, 2026