Nara Lokesh Birthday: ఏపీ మంత్రి నారా లోకేష్( AP Minister Nara Lokesh ) జన్మదిన నేడు. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి పుట్టినరోజు వేడుకలను. పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు జన్మదిన కేకులను కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచి పెట్టారు. సేవా కార్యక్రమాలు సైతం చేపట్టారు. ఆస్పత్రులలో రోగులకు పాలు పండ్లు పంచిపెట్టారు. అన్నదాన కార్యక్రమాలను సైతం నిర్వహించారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానానికి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టిడిపి నేతలు భారీగా విరాళాలు అందించారు.
* ఒకరోజు అన్నప్రసాదానికి వితరణ..
ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) కుటుంబ సభ్యుల పుట్టినరోజుల నాడు టీటీడీకి విరాళాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ టిటిడి కి భారీ విరాళాన్ని అందించారు. ఒక్కరోజు మొత్తం అన్న ప్రసాద వితరణకు అయ్యే ఖర్చు 44 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా చెల్లించారు. ఈ మొత్తం తో కూడిన డిడిని టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు కు అందజేశారు. చిత్తూరుకు చెందిన చింతల దివ్యాంత్ రెడ్డి అనే భక్తుడు టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య ప్రసాదిని పథకానికి 10 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా అందజేశారు. అందుకు సంబంధించిన డీడిని అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
* కొనసాగుతున్న రద్దీ.. తిరుమలలో( Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 75 వేల మంది వరకు భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 27 వేల మంది తలనీలాలను సమర్పించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.98 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 17 కంపార్ట్మెంట్లలో భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. మరోవైపు రథసప్తమి వేడుకలకు ముస్తాబౌతోంది తిరుమల. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు జరుగుతున్నాయి.