spot_img
Homeఆంధ్రప్రదేశ్‌BJP And Jagan: బిజెపికి జగన్ శాశ్వత మిత్రుడు ఎలా?!

BJP And Jagan: బిజెపికి జగన్ శాశ్వత మిత్రుడు ఎలా?!

BJP And Jagan: భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఓ విశ్లేషకుడు చెప్పిన మాటలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా సర్కులేట్ చేస్తోంది. అయితే ఈ శాశ్వత స్నేహం అనేది ఎలా సాధ్యమో తెలియడం లేదు. బిజెపి సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటుంది వైసీపీ భావజాలం. సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా విభిన్నంగా ఉంటుంది. బిజెపి హిందుత్వ సిద్ధాంతాలతో ముందుకు వెళుతుంది అనేది బహిరంగ రహస్యం. అయితే జగన్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు బిజెపికి వ్యతిరేకంగా ఉంటుంది. అటువంటి వైసీపీని పట్టుకొని శాశ్వత మిత్రుడు అంటూ అమిత్ షా చెప్పారని చెప్పడం చూస్తుంటే మాత్రం దీని వెనుక రాజకీయ కోణం ఉందన్నది అర్థం అవుతోంది. అసలు అమిత్ షా అలా ఎందుకు అంటారు అనేది ప్రశ్న. ఇది కావాలనే చేస్తున్న ప్రచారంగా అర్థం అవుతోంది.

* అప్పటి మాదిరిగానే..
ఏపీలో కూటమిలో ఒక రకమైన గందరగోళం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నం అవుతుంది. గతంలో ప్రత్యేక హోదా విషయంలో ఇలాంటి గందరగోళం సృష్టించి లబ్ధి పొందింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబును కార్నర్ చేసి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేలా చేశారు. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నం అన్నట్టు అనుమానాలు ఉన్నాయి. టిడిపి కీలక భాగస్వామి ఎన్డీఏలో. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వంలో బిజెపి భాగస్వామి. ఒక భాగస్వామి పార్టీ ఉండగా.. దాని ప్రత్యర్థి పార్టీని శాశ్విత మిత్రుడిగా ఎలా చూస్తారు. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా చేసుకుంటున్న ప్రచారం అని స్పష్టంగా తెలుస్తోంది.

* అంతిమంగా జగన్ కే నష్టం
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో కాస్త భయం ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికల ఫలితాలే అందుకు కారణం. రాష్ట్రాలన్నీ బిజెపి చేతిలో ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ సీట్లు మాత్రం అనుకున్నది సాధించలేకపోయింది. అందుకు చక్కటి ఉదాహరణ ఉత్తరప్రదేశ్. అటువంటి పరిస్థితి వస్తే సరైన మిత్రుడు ఉండడు. పోనీ జగన్ మోహన్ రెడ్డితో బిజెపి నేరుగా పొత్తు పెట్టుకోగలదా? బిజెపితో జగన్ కలవగలరా? మరి ఎలా శాశ్వత మిత్రుడు అనేది ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారికే తెలియాలి. ఆయనకు నేరుగా అమిత్ షా ఫోన్ చేశారా? లేకుంటే పవన్ కళ్యాణ్ చెవిలో చెప్పారా? అనేది తెలియాలి. ఒకవేళ అమిత్ షా జగన్మోహన్ రెడ్డి తమకు శాశ్వత మిత్రుడు అని వైసిపి ప్రచారం చేసుకుంటే.. తమపై అవినీతి మరక పడుతుందని బిజెపి పెద్దలు భావిస్తే.. అది అసలుకే జగన్మోహన్ రెడ్డికి చేటు తెచ్చే అంశంగా మారిపోతుందని రాజకీయ అనుభవజ్ఞుల మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper