https://oktelugu.com/

Sankranti 2025: కోయ్ కోయ్.. కోడిని కోయ్.. ఇదెక్కడి మాస్ రా మావా!

మూడు రోజుల పండుగ సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతోంది. భోగి, సంక్రాంతి వేడుకలు ఇప్పటికే ఘనంగా జరిగాయి. ఈ వేడుకల కోసం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేలాదిమంది వెళ్లిపోయారు. దీంతో హైదరాబాద్ నగరం ఖాళీగా కనిపిస్తోంది. రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 15, 2025 / 10:25 AM IST

    Sankranti 2025(4)

    Follow us on

    Sankranti 2025: భోగి, సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కనుమ నాడు కూడా వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలంగాణలో సంక్రాంతి నాడే ప్రజలు ముక్కలు లాగించారు. కోడికూర, యాటకూరతో దావతులు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భోగినాడు శాఖాహార వంటలు వండుకుంటే.. సంక్రాంతి నాడు మాంసాహారంతో విందులు చేసుకున్నారు. కొన్నిచోట్ల ప్రత్యేకంగా వేడుకలు చేసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కళాకారులను రప్పించి గంగిరెద్దులతో నృత్యాలు, ప్రత్యేకంగా పిండి వంటలు పండించారు. అందమైన రంగవల్లులు వేసి.. వాటి మధ్యలో గొబ్బెమ్మలను పెట్టి.. చిన్నారులపై భోగి పళ్ళు పోశారు. సాయంత్రం పూట పతంగులు ఎగరవేసి సందడి చేశారు. సంస్కృతి, సంప్రదాయాన్ని వ్యక్తం చేసే విధంగా దుస్తులు ధరించారు. కాంక్రీట్ జంగిల్ లో బతుకుతూ.. మనదైన జీవన విధానాన్ని మర్చిపోతున్న వారంతా పై తరహా లో ఈసారి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాద్ నగరానికి దూరంగా ఉన్న రిసార్ట్లలో వారంతా సంక్రాంతి పండుగను ఆస్వాదించారు.

    కోయ్ కోయ్..

    తెలంగాణలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరగగా.. ఆంధ్రప్రదేశ్లో అంతకుమించి అనేలాగా కొనసాగుతున్నాయి. కోడిపందాలు జోరుగా నడుస్తున్నాయి.. ఇక కనుమనాడు మాంసాహార వంటకాలు రారమ్మని ఇతర ప్రాంతాల వాసులను ఆహ్వానిస్తున్నాయి. భోగి, సంక్రాంతి తర్వాత ఆంధ్ర ప్రజలు కనుమ రోజు మాంసాహారాన్ని వండుకుంటారు.. ఇక కోడిపందాల్లో ఓడిపోయిన పుంజుల మాంసాన్ని కొంతమంది ప్రత్యేకంగా తెప్పించుకొని వండించుకుంటారు. మాంసాహారంతో వంటకాలు వండి పితృదేవతలకు సమర్పించుకుంటారు. అయితే ఇందులోనూ కొంతమంది వెరైటీ విధానాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కోయ్ కోయ్ అనే పాట ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాస్టర్ మీసాల గురువప్ప పాడిన ఈ పాట సామాజిక మాధ్యమాలలో పెను సంచలనానికి నాంది పలుకుతోంది. అయితే ఈ పాటను రకరకాలుగా సోషల్ మీడియా ఇన్ ప్లూయన్సర్ లు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలోని ఒక కుటుంబం కోయ్ కోయ్ అనే పాటను ప్రతిబింబిస్తూ కోడి ముగ్గును తమ ఇంటి ముంగిట వేసింది. దానికి ” కనుమనాడు కోయ్ కోయ్” అనే క్యాప్షన్ జత చేసింది. దానిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “కనుమనాడు మాంసాహారాన్ని వండుకొని తింటారు. దాన్ని ప్రతిబింబించే విధంగా ఇలా రంగవల్లి రూపొందించారు. వీరు సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. అందువల్లే సంక్రాంతి రంగవల్లి కూడా అదేవిధంగా తీర్చిదిద్దారు. రంగవల్లిలో వారు వేసిన కోడి కూడా చాలా దిట్టంగా ఉంది. చూస్తుంటే పందెం పుంజులాగా దర్శనమిస్తోంది. ఇలాంటి పుంజును గనుక తింటే మామూలుగా ఉండదని” పేర్కొంటున్నారు.