Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: షర్మిలకు బెయిల్ వచ్చింది: కానీ షరతులు వర్తిస్తాయి

YS Sharmila: షర్మిలకు బెయిల్ వచ్చింది: కానీ షరతులు వర్తిస్తాయి

YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలకు బెయిల్ మంజూరు అయింది. నాంపల్లి కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 30 వేలు, ఇద్దరి పూచీకత్తు తో కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. ఈ ప్రకారం షర్మిల విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. పోలీసులపై దాడి చేసిన నేపథ్యంలో షర్మిలపై సోమవారం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

మంగళవారం నాంపల్లి కోర్టులో ఇరుపక్షాల వాదనలు నడిచాయి. పోలీసులు ఆమెను అక్రమంగా అరెస్టు చేశారని షర్మిల తరపు న్యాయవాది వాదించారు. అంతేకాదు షర్మిలపై నమోదు చేసిన సెక్షన్లు మొత్తం ఆరు నెలలు లేదా మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడేవే అని ఆమె తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. అంతేకాదు హైకోర్టు నిబంధనలు పోలీసులు పట్టించుకోవడంలేదని షర్మిల తరపున న్యాయవాది వాదించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున న్యాయవాది షర్మిలపై పలు కేసులు ఉన్నాయని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో షర్మిలలు ఇంకా ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు నాంపల్లి కోర్టుకు విన్నవించారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి షర్మిలకు బెయిల్ ఇచ్చేందుకే మొగ్గు చూపడం విశేషం.

నిన్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసును విచారిస్తున్న అధికారులను కలవడానికి షర్మిల వెళ్లారు.. అయితే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సహనం కోల్పోయిన షర్మిల ఒక ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారి పై చేయి చేసుకున్నారు. మరో మహిళా కానిస్టేబుల్ ను చేతితో నెట్టేశారు. అంతే కాదు తన కారుకు అడ్డంగా ఉన్న పోలీసుల మీద నుంచి వాహనం తీసుకెళ్లాలని తన డ్రైవర్ ను ఆదేశించారు. ఈ క్రమంలోనే షర్మిల కారు టైరు రవీందర్ అనే కానిస్టేబుల్ అరికాలు మీది నుంచి వెళ్లడంతో అతనికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చివరకు షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించి.. అనంతరం కోర్టులో హాజరు పరిచారు.. వచ్చేనెల 8వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే షర్మిలను పరామర్శించేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వైయస్ విజయలక్ష్మిని పోలీసులు అడ్డుకోవడంతో ఆమె కూడా సహనం కోల్పోయి విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. ఆమెపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

మంగళవారం అనేక వాదనల తర్వాత నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఆమెకు బెయిల్ ఇచ్చేందుకే మొగ్గు చూపారు. అంతేకాదు అనేక షరతులు విధించారు.. ఎటువంటి వివాదాస్పద కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆమెకు హుకుం జారీ చేశారు. అంతే కాదు తమ అనుమతి లేకుండా దేశం దాటి బయటికి వెళ్లకూడదని న్యాయమూర్తి స్పష్టంగా చెప్పారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular