MLA Adimoolam: ఏపీలో ఇటీవల లైంగిక అంశాలు రాజకీయ నేతలకు ఇరుకున పెడుతున్నాయి. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళ టిడిపి ఎమ్మెల్యే పై నేరుగా హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. సీక్రెట్ కెమెరాతో తీసిన ఆధారాలతో సహా బయటపెట్టారు. వాటిని మీడియాకు సైతం అందించారు. దీంతో సదరు ఎమ్మెల్యే పై వేటు వేసింది టిడిపి హై కమాండ్. ఇంకోవైపు మరో ఎమ్మెల్యే పై లైంగిక వేధింపుల ఆరోపణ వచ్చింది. ఆయన వ్యవహార శైలి ఇటీవల వివాదాస్పదగా మారింది. ఈ తరుణంలో సదరు ఎమ్మెల్యే వద్దకు పనుల నిమిత్తం వెళ్లే వారిపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఎమ్మెల్యే ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్న ఆడియో ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో దీనిపై రచ్చ నడుస్తోంది. చాలా అందంగా ఉన్నావ్.. చాలా బాగున్నావ్ అంటూ మాట్లాడుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు ఆడియోను ట్రోల్ చేస్తున్నాయి.అయితే ఆ గొంతు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ది అంటూ వైసిపి అనుకూల మీడియా ప్రచారం చేయడం విశేషం.
* ఓ మహిళా నేత ఫిర్యాదుతో
కొద్ది రోజుల కిందట సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను వేధిస్తున్నారంటూ టిడిపికి చెందిన ఓ మహిళ నేత ఆరోపించారు. అంతటితో ఆగకుండా తిరుపతిలోని ఓ లాడ్జిలో ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశారంటూ సీక్రెట్ కెమెరాతో తీసిన ఫోటోలు, వీడియోను బయటపెట్టారు. ఏకంగా టిడిపి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హై కమాండ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై సస్పెన్షన్ వేటు వేసింది. అదే సమయంలో బాధిత మహిళ నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది. కోర్టులోకి చేరింది ఈ అంశం.
* ఇంతలోనే మరో వివాదం
అయితే ఈ కేసు విషయంలో రాజీ పడ్డారు బాధిత మహిళ. తనపై ఎమ్మెల్యే ఆదిమూలం ఎటువంటి వేధింపులకు పాల్పడలేదంటూ ఆమె తరుపు న్యాయవాది లిఖితపూర్వకంగా కోర్టులో తెలియజేశారు. దీంతో కేసు రాజీకి మార్గం ఏర్పడింది. అయితే ఇంతలో అదే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గొంతుతో కూడిన ఆడియో హల్ చల్ చేస్తోంది. తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ గొంతు ఎమ్మెల్యే ఆదిమూలానిదా? కాదా? అన్నది తేలాల్సి ఉంది.