https://oktelugu.com/

Chalaki Chanti: ఆసుపత్రిలో ఉంటే నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి!

గత ఏడాది గుండెపోటు తో చలాకీ చంటి ఆసుపత్రి పాలయ్యాడు. ఆ తర్వాత సరైన చికిత్స తీసుకొని క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాడు. అలా గత కొంతకాలంగా అనేక రకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంటి ఎట్టకేలకు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 14, 2024 / 05:11 PM IST

    Chalaki Chanti

    Follow us on

    Chalaki Chanti: ఈటీవీ లో గత 12 ఏళ్ళ నుండి విరామం లేకుండా ప్రసారం అవుతున్న ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంత మంది కమెడియన్స్ అడుగుపెట్టారో మన అందరికీ తెలిసిందే. ప్రతీ ఒక్కరు ఎంతో కామెడీ టైమింగ్ ఉన్నవాళ్ళు. ఆ జాబితాలో చలాకీ చంటి కూడా ఉన్నాడు. జబర్దస్త్ లో తన అద్భుతమైన కామెడీ టైమింగ్, డైలాగ్ మాడ్యులేషన్ తో అదరగొట్టిన చంటికి సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అలా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన చలాకి చంటి బిగ్ బాస్ సీజన్ 6 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యాడు. అయితే చలాకీ చంటి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జబర్దస్త్ షో మానేసాడు. ఇప్పుడు ఈయనకు సినిమాల్లో కూడా అవకాశాలు రావడం లేదు.

    గత ఏడాది గుండెపోటు తో చలాకీ చంటి ఆసుపత్రి పాలయ్యాడు. ఆ తర్వాత సరైన చికిత్స తీసుకొని క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాడు. అలా గత కొంతకాలంగా అనేక రకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంటి ఎట్టకేలకు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ క్రమంలో రీసెంట్ గానే ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన గుండెపోటు వచ్చి ఆసుపత్రి పాలైనప్పుడు అతనికి ఎదురైన కొన్ని సంఘటనలను తలచుకొని ఎమోషనల్ అయ్యాడు.

    చంటి మాట్లాడుతూ ‘డబ్బు ఉంటేనే ఈ కాలం లో ఒక మనిషికి విలువ ఉంటుందని, గత ఏడాది నేను గుండెపోటు తో ఆసుపత్రి పాలైనప్పుడే తెలిసింది. ఇన్నేళ్లు ఇండస్ట్రీ లో ఉన్నాను, ఎంతోమంది స్నేహితులను ఏర్పర్చుకున్నాను. కానీ నేను ఆసుపత్రి పాలైతే ఒక్కరు కూడా నన్ను పట్టించుకోలేదు. కొంతమంది ఫోన్ చేసి ఎదో మొక్కుబడిగా నా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. డబ్బులు లేకుంటే ఇది ఒక ఆర్టిస్టుకి దక్కే గౌరవం. నాకు మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్న ప్రతీ ఆర్టిస్టు పరిస్థితి ఇంతే. మేము సినీ సెలబ్రిటీస్ కదా, మేము డబ్బులు బాగా సంపాదించేస్తాము అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మా కష్టాలు చూస్తే వాళ్ళు తట్టుకోలేరు. మేము ఎంత సంపాదిస్తున్నాము అనేది మాకు మాత్రమే తెలుస్తుంది. మనం జీవితం లో ఎవరి దగ్గర డబ్బులు ఆశించకూడదు, స్నేహితులు, బంధువులు కూడా డబ్బులు విషయం వచ్చేసరికి ముఖం చాటేస్తారు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. చంటి కి యాంకర్ ప్రదీప్ సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఇలా ఇండస్ట్రీ లో ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. వీళ్ళందరూ చంటిని అన్నా అంటూ ప్రేమగా పిలుస్తూ తిరిగేవారు. యాంకర్ శ్రీముఖి, రష్మీ,అనసూయ వంటి వారు కూడా చంటి కి మంచి స్నేహితులు. అలాంటిది అతనికి గుండెపోటు వచ్చి ఆసుపత్రి పాలైతే ఒకే కుటుంబం లాగా ఉండే వీళ్లు ఒక్కరు కూడా ఆసుపత్రికి వెళ్లి చూడలేదా అని ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజెన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.