Assembly Seats Increase: ఏపీలో ( Andhra Pradesh) నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎవరికి లాభం? రాజకీయంగా ఎవరికి ప్రయోజనం? ఏ పార్టీకి సింహభాగం ప్రయోజనాలు దొరుకుతాయి? ఏ పార్టీ తమ ప్రాతినిధ్యం పెంచుకోనుంది? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఎందుకంటే 2026 ద్వితీయార్థంలో జనగణన ప్రారంభించనుంది. అదే సమయంలో కుల గణన కూడా చేపట్టనుంది. ఈ రెండు పూర్తయితే.. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించనుంది. నియోజకవర్గాల పునర్విభజనతో ఏపీలో 50 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. అంటే వందలాదిమంది నేతలకు అవకాశాలు దక్కనున్నాయి అన్నమాట. పార్టీలపరంగా తీసుకుంటే కూటమి వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు ఉంటాయి. చిన్నాచితక పార్టీలు సైతం పోటీ చేస్తాయి. అంటే వందలాదిమంది ఆశావహులకు ఒక అవకాశం దక్కనుంది అన్నమాట.
Also Read: రాజకీయాల నుంచి ‘రాజు’ వెడలే.. నాలుగు దశాబ్దాల అనుబంధానికి తెర!
అవసరం అనుకుంటే వారసులను పంపించి..
అయితే తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) ఇప్పటికే సీనియర్లు ఉన్నారు. అయితే వారు పక్కకు తప్పుకొని తమ వారసులకు అవకాశం ఇచ్చారు. మరోవైపు జనసేన సైతం 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసింది. రెండు పార్లమెంట్ స్థానాలను సైతం చేజిక్కించుకుంది. బిజెపి సైతం ఓట్ల తో పాటు సీట్లు పెంచుకుంది. 8 అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే జనసేన తో పాటు బిజెపి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది. అయితే జనసేన వరకు టిడిపి ఓకే చెప్పవచ్చు కానీ.. బిజెపికి మాత్రం ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం లేదు. కాదు కూడదు అనుకుంటే 2024లో మాదిరిగానే పార్లమెంట్ సీట్ల పరంగా ఎక్కువ ఇచ్చే అవకాశం బిజెపికి ఉంది.
పెరగనున్న నియోజకవర్గాలు..
నియోజకవర్గాల పునర్విభజనతో 225 అసెంబ్లీ సీట్లు కానున్నాయి. ఇందులో మెజారిటీ దక్కాలంటే 115 సీట్లు అవసరం. అలా దక్కాలంటే 150కి పైగానే టిడిపి తన వద్ద ఉంచుకుంటుంది. ఓ 75 సీట్లను మాత్రం అటు ఇటుగా పంచుతుంది. అయితే బిజెపి( Bhartiya Janata Party) కంటే జనసేనకే ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను.. రమారమి 12 శాతం సీట్లను కేటాయించింది. కానీ ఈసారి ఓ 20 శాతం సీట్లు కేటాయించాల్సిన అవసరం టిడిపికి ఉంది. అంటే 35 నుంచి 50 వరకు జనసేనకు విడిచి పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. బిజెపి కి సైతం 10 నుంచి 25 సీట్లు పెంచే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో నేతలు ఎక్కువ. చాలా నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన వారు కూడా ఉన్నారు. అటువంటి వారికి సీట్లు సర్దుబాటు చేసే క్రమంలో.. అవసరం అనుకుంటే జనసేన, బిజెపిలోకి పంపించే అవకాశం కూడా ఉంది.
Also Read: పదవుల్లేవ్.. పవన్ కళ్యాణ్ కు షాకిచ్చిన బాబు
కూటమికి అవకాశం..
వచ్చే ఏడాది ద్వితీయార్థంలో కుల గణనతో పాటు జనగణన పూర్తవుతుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రారంభం కానుంది. ప్రస్తుతం టిడిపి కూటమి ఎన్డిఏలో( National democratic Alliance ) కొనసాగుతుండడంతో.. కచ్చితంగా ఏపీలో కూటమి ప్రయోజనాలకు తగ్గట్టు నియోజకవర్గాల విభజన ఉండనుంది. 2009 లో సైతం అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీకి పునర్విభజన కలిసి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు అదే దోహద పడింది. ఇప్పుడు కూడా కూటమి ప్రయోజనాలకు తగ్గట్టుగానే పునర్విభజన ఉండనుంది. చూడాలి మరి ఈ విభజనలు ఎలాంటి ప్రయోజనాలు కూటమి దక్కించుకుంటుందో?