https://oktelugu.com/

Kamma Global Summit: కమ్మ సామాజిక వర్గం సంచలనం!

సంఖ్యా బలంగా మిగతా సామాజిక వర్గాలతో పోల్చుకుంటే కమ్మ సామాజిక వర్గ జనాభా తక్కువే. అయినా సరే రాజకీయ అవకాశాలు, సినీ రంగంలో తమదైన ముద్ర, పారిశ్రామిక రంగంలో రాణింపు తదితర విషయాల్లో కమ్మ సామాజిక వర్గం ముందు ఉంది.

Written By: , Updated On : January 31, 2024 / 10:58 AM IST
Kamma Global Summit
Follow us on

Kamma Global Summit: మిగతా సామాజిక వర్గాలతో పోలిస్తే.. కమ్మ సామాజిక వర్గంలో ఐక్యత అధికం. స్వాతంత్రానికి ముందు నుంచే ఆ కులంలో ఐక్యత రాగాలు కనిపించాయి. విద్య, వైద్య, పారిశ్రామిక, సినీ, రాజకీయ రంగాల్లో వారు ముందు నిలవడానికి ముమ్మాటికి ఐక్యతే కారణం. విద్య పై బ్రాహ్మణ వర్గం ఆధిపత్యాన్ని ప్రశ్నించి.. ప్రతి ఒక్కరికి విద్య అందాలని సమాజంలో మొదట అడుగు వేసింది కమ్మ సంఘమే. కమ్మ కులానికి చెందిన తొలి మహాసభ 1910లో కృష్ణాజిల్లా కౌతారంలో జరిగింది. ఇప్పటికీ ఆ మహాసభలు కొనసాగుతూనే ఉన్నాయి.

సంఖ్యా బలంగా మిగతా సామాజిక వర్గాలతో పోల్చుకుంటే కమ్మ సామాజిక వర్గ జనాభా తక్కువే. అయినా సరే రాజకీయ అవకాశాలు, సినీ రంగంలో తమదైన ముద్ర, పారిశ్రామిక రంగంలో రాణింపు తదితర విషయాల్లో కమ్మ సామాజిక వర్గం ముందు ఉంది. బ్రిటిష్ కాలం నాటి నుంచి విద్యాపరంగా ముందడుగు వేసింది కమ్మ సామాజిక వర్గం. అప్పట్లో సైన్యంలో కూడా వీరిదే కీలక పాత్ర. అందుకే అభివృద్ధి ఫలాలు వారు అనుభవించగలిగారు. సైన్యంలో కీలక అధికారులు గా ఉండడంతో.. నదీ పరివాహక ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న నగరాలు చెంతన కమ్మ సామాజిక వర్గం స్థిరపడినట్లు చరిత్ర చెబుతోంది. తొలుత వ్యవసాయ రంగంపై అడుగులు వేసిన వారు.. తరువాత పారిశ్రామిక రంగంపై దృష్టి పెట్టారు. ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్ట్ వంటి రంగాల్లో రాణించారు. ఒక్క మనదేశంలోనే కాకుండా.. ప్రపంచ దేశాల్లో వ్యాపారాలు చేసితమదైన పాత్ర పోషించారు.సినీ రంగంలో రాణించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన తరువాత.. కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ గా మారింది.

అయితే కమ్మ సామాజిక వర్గం తన ప్రాబల్యాన్ని నిలుపుకునేందుకు ఏకతాటి పైకి రావడం విశేషం. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో కమ్మ సామాజిక వర్గంలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. తమ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందన్న భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. మార్చి 25న కమ్మ గ్లోబల్ సమ్మెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా కమ్మ ప్రముఖులు, వివిధ రంగాల్లో రాణించిన వారు ఒకే తాటిపైకి రానున్నారు. ఏపీలో 28 లక్షల ఓటర్లు, తనలో 18 లక్షలు, తమిళనాడులో 16 లక్షలు ఓటర్లు ఉన్నట్లు కమ్మ ప్రతినిధులు చెబుతున్నారు. కమ్మ ప్రాతినిధ్యం పెరగాలని కోరుతున్నారు. అయితే సరిగ్గా ఎన్నికల ముంగిట కమ్మ గ్లోబల్ సమ్మెట్ నిర్వహణకు పూనుకోవడం మాత్రం సంచలనం కలిగిస్తోంది. ప్రత్యేక రాజకీయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు విషయంలో చాలా అన్యాయం జరిగిందని కమ్మ సామాజిక వర్గం ఆగ్రహంతో ఉంది. అందుకే ఈసారి ఏకపక్షంగా మద్దతు తెలపాలని మెజారిటీ కమ్మలు సామాజిక వర్గం స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యింది. అందుకోసమే పట్టు పట్టి ఎన్నికల ముంగిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.