Raashii Khanna: ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా మనం మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. ఆ చిత్రంలో చిన్న క్యామియో రోల్ చేసింది. దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఊహలు గుసగుసలాడే చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. నాగ శౌర్య హీరోగా చేశాడు. ఊహలు గుసగుసలాడే మంచి మూవీగా పేరు తెచ్చుకుంది. జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్… ఇలా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్ వచ్చాయి.
అనూహ్యంగా జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో రాశి ఖన్నా మెయిన్ లీడ్ హీరోయిన్ కాగా నివేదా థామస్ మరో హీరోయిన్. జై లవకుశ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే మరలా ఆమెకు స్టార్స్ పక్కన ఛాన్సులు రాలేదు. 2019లో రాశి ఖన్నా కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగింది. ఆమె నటించిన వెంకీ మామ, ప్రతిరోజూ పండగే చిత్రాలు విజయాలు సాధించాయి. ముఖ్యంగా ప్రతిరోజూ పండగే భారీ విజయం సాధించింది.
తర్వాత తెలుగులో రాశి ఖన్నాకు హిట్ లేదు. విజయ్ దేవరకొండతో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ రాశి ఖన్నా ఇమేజ్ దెబ్బతీసింది. ఆ మూవీలో రాశి బోల్డ్ రోల్ చేసింది. వరల్డ్ ఫేమస్ లవర్ ఫెయిల్యూర్ అనంతరం ఆమె తమిళ్ లో ఎక్కువగా చిత్రాలు చేశారు. 2022లో పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాల్లో నటించింది. అవి రెండూ పరాజయం పాలయ్యాయి. దాంతో టాలీవుడ్ కి దాదాపు దూరమైంది.
ప్రస్తుతం హిందీ, తమిళ చిత్రాలు చేస్తుంది. అయితే రాశి ఖన్నా స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకోలేకపోయింది. బాలీవుడ్ కి వెళ్ళాక అమ్మడు గ్లామర్ డోస్ పెంచేస్తుంది. తాజాగా ఆమె హాట్ ట్రెండీ వేర్లో అభిమానుల మనసులు దోచేసింది. చాలీ చాలని టాప్ ధరించి మైండ్ బ్లాక్ చేసింది. రాశి ఖన్నా తెగింపు చూస్తుంటే ఆఫర్స్ కోసం అందాలు ఎర వేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.