Appointments : విజయవాడ : జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసిన క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం లలో టెక్స్ టైల్ డిజైనర్ 12 ఖాళీలు, క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జి క్యూటివ్ 10 ఖాళీలలో తాత్కాలిక పద్దతిలో పనిచేయుటకు దరఖాస్తులు కోరుతున్నట్లు జౌళి – చేనేత శాఖ కమిషనర్ ఎమ్ ఎమ్. నాయక్ ఒక ప్రకటనలో కోరారు.
అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను కమిషనర్ చేనేత – జౌళి శాఖ 4వ అంతస్తు, ఐ హెచ్ సి కార్పొరేట్ బిల్డింగ్ ఆటో నగర్, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ పిన్ కోడ్ నెం 522503 చిరునామాకు పంపవలసిందిగా ఆయన తెలియజేసారు. పథక వివరాలు మరియు నోటిఫికేషన్ వివరాలు https://www.aphandtex.gov.in చేనేత జౌళి శాఖ వెబ్ సైట్ నుండి పొందాలని చెప్పారు.
ఇతర వివరాలను వారి కార్యాలయ ఫోన్ నెం 08645-232466 ద్వారా పొందవచ్చునని ఆ ప్రకటనలో తెలిపారు. కావున ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ప్రకటన వెలువడిన తేదీ నుండి 14 రోజులు లోపు పై ఖాళీలలో తాత్కాలిక పద్దతిలో పనిచేయుటకు దరఖాస్తులు సమర్పించాలని ఒక ప్రకటనలో చేనేత జౌళి శాఖ కమిషనర్ ఎమ్ ఎమ్. నాయక్ తెలియజేశారు.
(సహాయ సంచాలకులు, రాష్ట్ర సమాచార కేంద్రం, విజయవాడ వారి ద్వారా జారీ)