Pawan Kalyan Birthday: కర్మయోగి పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. సెప్టెంబర్ 2న బాపట్లలో ఆయన జన్మించారు. పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్రావు పోలీస్ కానిస్టేబుల్. ట్రాన్స్ఫర్స్ లో భాగంగా పలు ఊళ్లలో పవన్ కళ్యాణ్ విద్యాభ్యాసం సాగింది. అన్నయ్య చిరంజీవి హీరోగా నిలదొక్కుకున్నాక పవన్ కళ్యాణ్ కుటుంబంతో పాటు చెన్నై వెళ్లారు. తర్వాత హైదరాబాద్ కి రావడం జరిగింది.
సామాజిక-విప్లవ భావాజాలం
పవన్ కళ్యాణ్ కి చిన్నప్పటి సామాజిక స్పృహ ఉండేది. ఈ క్రమంలో ఆయన మదిలో రాడికల్ ఆలోచనలు పుట్టాయి. చేగువేరా వంటి విప్లవకారుల స్పూర్తితో నక్సలిజం వైపు అడుగులు వేద్దామన్న ఆలోచనలు కలిగాయి. ఒక దశలో గన్ పట్టుకొని ఉద్యమం వైపు నడవాలని అనుకున్నారు. ఆయన చదివిన పుస్తకాలు, సామాజిక స్పృహ ఈ ఆలోచనలకు కారణమయ్యాయి.
హీరోగా ఎంట్రీ
అన్నయ్య మెగాస్టార్ అయినా కూడా పవన్ కళ్యాణ్ హీరో అవ్వాలని అనుకోలేదు. కేవలం వదిన సురేఖ ప్రోద్బలంతో హీరో కావాల్సి వచ్చింది. కళ్యాణ్ బాబు చూడటానికి చాలా అందంగా ఉంటాడు. నటుడిని చేస్తే సక్సెస్ అవుతాడని సురేఖ చిరంజీవికి సూచించడంతో ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయి. హీరో అయ్యాక కూడా పబ్లిక్ లో డాన్సులు చేయడం ఇబ్బంది అనిపించింది. సుస్వాగతం తర్వాత ఇక సినిమాలు చేయకూడదు అనుకున్నాడు.
అనతికాలంలో స్టార్ డమ్
పవన్ కళ్యాణ్ సక్సెస్ కి ప్రధాన కారణం ప్రత్యేకమైన శైలి. సాధారణంగా వారసులు తమ గాడ్ ఫాదర్స్ పేరు వాడటం, మేనరిజమ్స్ అనుకరించడం చేస్తారు. అందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ తనదైన మేనరిజం డెవలప్ చేశారు. తన సినిమాల్లో పాటలు, ఫైట్స్, కొన్ని సన్నివేశాలు ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకులకు సూచించేవారు. తొలిప్రేమ, బద్రి, ఖుషి చిత్రాలు పవన్ కళ్యాణ్ ని స్టార్ ని చేశాయి.
మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం
పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ పట్ల అమిత ఆసక్తి ఉండేది. కరాటేలో ఆయనకు బ్లాక్ బెల్డ్ ఉంది. ఈ మక్కువ తీర్చుకునేందుకు ఆయన ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ మనసు, శరీరం మీద అదుపు సాధిస్తాయని ఆయన నమ్ముతాడు.
పొలిటికల్ ఎంట్రీ
ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్మారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి యువరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు నెరవేర్చాడు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాడు. ఇప్పటి రాజకీయ పార్టీలకు ప్రత్యమ్నాయం అవసరమని 2014లో జనసేన పార్టీని స్థాపించారు.
రాజకీయం-సినిమా
ఒక రాజకీయ పార్టీని నడపడం అంత సులభం కాదు. అందుకు కొంత నిధి అవసరం. అందుకే పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. 2020 నుండి పవన్ కళ్యాణ్ చిత్రాలు చేస్తున్నారు. అటు రాజకీయంగా ప్రత్యర్థులను ఎదురిస్తూ ఇటు సిల్వర్ స్క్రీన్ పై అభిమానులను అలరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన అడుగులు పడుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో జనసేన అద్భుతం చేయడం ఖాయమే మాట వినిపిస్తుంది.