Appalaraju-CI controversy : కొందరు నేతలు అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరిస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానరాకుండా వ్యవహరిస్తారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంటారు. కానీ అదే సీన్ తమకు రివర్స్ అయితే మాత్రం తట్టుకోలేరు. అటువంటి కష్టమే వైసీపీ మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు (seedhiri appalaraju)వచ్చింది. నా కొడకా తమాషాలు చేస్తున్నావా అంటూ ఓ పోలీస్ అధికారికి హెచ్చరించారు. చొక్కా విప్పిస్తానంటూ బూతులు మాట్లాడారు. అయితే అప్పుడు ఆయన మంత్రి. ఇప్పుడు ఆయన మాజీ మంత్రి కదా.. అలా రువాబు చేసేసరికి తాజాగా ఓ పోలీస్ అధికారి నుంచి అదేస్థాయిలో రిప్లయ్ వచ్చింది. ఓ సమస్యపై గట్టిగానే నిలదీస్తూ మరింత జఠిలం చేస్తుండడంతో విసిగిపోయిన ఓ సీఐ ఏం తమాషాలు దె…అనేసరికి మాజీ మంత్రికి బొమ్మ కనిపించింది. టిట్ ఫర్ టేట్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాకు ఆయన టార్గెట్ అవుతున్నారు.
Also Read : ఆ టిడిపి మాజీ నేతకు జగన్ షాక్!
అప్పుడు విశాఖ శారదాపీఠంలో..
వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో విశాఖ శారదా పీఠం అధికార కేంద్రంగా మారింది. ఇది చెప్పనవసరం లేదు. రాజగురువుగా స్వామి స్వరూపానంద అప్పట్లో ఒక అధికార కేంద్రంగా మారిపోయారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అప్పట్లో ప్రత్యేక సందర్భాలు వచ్చిన ప్రతిసారి రాజగురువు స్వామి స్వరూపానందనకు దర్శనం చేసుకునేవారు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే ఏకంగా సీఎం ఉత్తరాంధ్ర వస్తుండడంతో మంత్రిగా ఉన్న అప్పలరాజు తన అనుచరులు, మందీ మార్భలంతో విశాఖ శారదాపీఠానికి చేరుకున్నారు. అయితే ముఖ్యమంత్రి భద్రత కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంత మంది అనుచరులతో వెళ్లడం కుదరదని.. ఒక్కరే వెళ్లాలంటూ విధుల్లో ఉన్న సీఐ చెప్పడంతో మంత్రి, ఆపై దర్పం ప్రదర్శించే అప్పలరాజుకు చెప్పలేని కోపం వచ్చింది. ‘ఏయ్ బాబూ ఏంటి తమాషాలు చేస్తున్నావా? చొక్కా పట్టుకొని లాగేస్తాను నా కొడకా..తమాషాలు దె..ఏంటీ?చొక్కా పట్టుకొని లాగేస్తాను నా కొడకా..ఎలా కనిపిస్తాను? అంటూ అప్పట్లో రుసరుసలాడుతూ అక్కడ నుంచి నిరసన వ్యక్తం చేస్తూ అనుచరులతో బయటకు వెళ్లిపోయారు.
ఇప్పడు ఓ గ్రామ వివాదంలో..
సీన్ కట్ చేస్తే మంత్రిగా ఉన్నఅప్పలరాజు మాజీ అయ్యారు. పలాస ఎమ్మెల్యేగాను భారీ ఓటమి చవిచూశారు. జిల్లాలోనే అత్యధిక ఓట్లతో ఓడిపోయి రికార్డు సాధించారు. దీంతో బొక్కా బోర్లా పడ్డారు. అయితే అధికారంలో ఉన్న దురుసుతనం ఇప్పుడు అప్పలరాజుకు చుక్కలు చూపిస్తోంది. ఏ పోలీసులనైతే అధికార దర్పంతో చొక్కా విప్పి కొడతా నా కొడకా..తమాషాలు చేస్తున్నావా? అని అన్నారో అదే డైలాడ్ తాజాగా ఎదురైంది. అది కూడా ఓ పోలీస్ అధికారి నుంచే. పలాస నియోజకవర్గంలోని ఓ గ్రామంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన గొడవలో ఓ సీఐ పుసుక్కున అంత మాట అనేశారు. ఈ వివాదంలో తప్పొప్పులను పక్కనపెడితే.. ఆ సీఐ ఘాటు, బూతు సమాధానం మాజీ మంత్రివర్యులకు అప్పటి రోజులను గుర్తు తెచ్చింది. అంటే కర్మ ఎవరికీ విడిచిపెట్టదు అని అర్థమైనట్టు ఉంది. అందుకే నాయకులు అన్నాక కాసింత నోటికి అదుపులో పెట్టుకోవడం చాలా మంచిదని ఈ ఘటన తెలియజేసింది.