AP Weather: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర వాతావరణ పరిస్థితి కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. తాజాగా ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆల్పపీడనం రాబోయే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదలనుంది. తరువాత బలహీన పడనుంది. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే బలహీన పడనుండడంతో ప్రభావం అంతగా ఉండదని తెలుస్తోంది. అయితే ఇప్పటికే గత రెండు రోజులుగా చేదురు మదురుగా వర్షాలు పడ్డాయి.
Also Read: మంత్రుల విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం.. తొలగింపు!
* కొనసాగుతున్న ఎండల తీవ్రత
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎండల( summer heat ) తీవ్రత కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం విశేషం. మరోవైపు రాయలసీమలో కూడా ఎండల తీవ్రత క్రమేపి పెరుగుతోంది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు నమోదవుతూ వస్తున్నాయి. అయితే అల్పపీడన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడడంతో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ మిగతా ప్రాంతాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.
* ఈ జిల్లాల్లో ఈరోజు వర్షం.. బంగాళాఖాతంలో( Bay of Bengal ) ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చని.. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు.
* 21 మండలాల్లో వేడి గాలులు..
కాగా రాష్ట్రంలో గురువారం చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. ప్రధానంగా విశాఖపట్నం( Visakhapatnam),కాకినాడ ప్రకాశం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. కాకా ఈరోజు 21 మండలాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది.