https://oktelugu.com/

AP Temperature : అగ్గి మంటలో ఏపీ.. ఆ జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు!

AP Temperature: సాధారణంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత( temperature) అంటే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనవసరం లేదు. కానీ ఇప్పుడు 40 డిగ్రీల కు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. వేడి గాలులు విజృంభిస్తున్నాయి. జనాన్ని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

Written By: , Updated On : March 20, 2025 / 12:35 PM IST
AP Temperature

AP Temperature

Follow us on

AP Temperature : ఏపీలో( Andhra Pradesh) ఎండలు మండిపోతున్నాయి. నడివేసవి రాకమునుపే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు ఒక్క పూతతో జనం అల్లాడిపోతున్నారు. అప్పుడే రాష్ట్రంలో రోళ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అమాంతరం పెరిగాయి. అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది.

Also Read : అలర్ట్‌ ఏపీ.. రెండు రోజులు చాలా జాగ్రత్త.. బయటకు రాకపోవడమే బెటర్‌!

* రాయలసీమలో అధిక ప్రభావం
సాధారణంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత( temperature) అంటే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనవసరం లేదు. కానీ ఇప్పుడు 40 డిగ్రీల కు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. వేడి గాలులు విజృంభిస్తున్నాయి. జనాన్ని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి రాయలసీమలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం విశేషం. ఉత్తరాంధ్రలో సైతం వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. ఉదయం 8 నుంచి ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు రహదారుల పైకి వచ్చేందుకు ఇష్టపడడం లేదు.

* రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. నంద్యాల( Nandyala), కడప జిల్లాలో బుధవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3, కడప జిల్లా అట్లూరు, కాజీపేటలో 41.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు అయినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 40.7, కర్నూలు నగరంలో 40.6, అన్నమయ్య రాయచోటి జిల్లాలోని కంబాలకుంటలో 40.2 నారా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో సైతం 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది.

* వడగాల్పుల తీవ్రత
కాగా రాష్ట్రవ్యాప్తంగా( state wide) వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. గురువారం 59 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 20, పార్వతీపురం మన్యంలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు, కాకినాడ జిల్లాలో మూడు, తూర్పుగోదావరి జిల్లాలోని ఐదు మండలాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాధ్ తెలిపారు. మరోవైపు పెరిగిన ఎండల తీవ్రతతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇదే పరిస్థితి కొద్దిరోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.