Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Heatwave: ఏపీకి భారీ హెచ్చరిక!

Andhra Pradesh Heatwave: ఏపీకి భారీ హెచ్చరిక!

Andhra Pradesh Heatwave: ఏపీలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడు ఉగ్రరూపం దాల్చి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఎండలకు తోడు తీవ్రమైన వేడితో పాటు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 45 డిగ్రీలకు పైగా నమోదు అవుతుండడంతో ప్రజలు ఉడికిపోతున్నారు. రాష్ట్రంలోని వందకు పైగా మండలాల్లో 41 డిగ్రీలకు తక్కువ కాకుండా ఉష్ణోగ్రత నమోదు అయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి అన్నట్టు ప్రకటనలు జారీచేస్తోంది. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తుంది.
* రాష్ట్రవ్యాప్తంగా శనివారం 18 జిల్లాల పరిధిలోని 172 మండలాల్లో 41 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
* రాయలసీమలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అనంతపురం జిల్లా రాయదుర్గం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్కాపురం తో పాటు శ్రీ సత్యసాయి జిల్లాల్లో 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
* కోస్తాంధ్రకు సంబంధించి నెల్లూరు, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో కూడా 42 డిగ్రీలకు పైగా వేడి గాలులు వీస్తున్నాయి.
* నేను ఆదివారం సైతం 23 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది.
* ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. సెల్ఫోన్లకు ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular