AP Rains : ఏపీకి ( Andhra Pradesh)చల్లటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోకి రుతుపవనాల ఎంట్రీ పై స్పష్టత వచ్చింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కేరళ, గోవాలో విస్తరించాయి. రానున్న రెండు,మూడు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 29 వరకు ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
* ఒక్కో రాష్ట్రాన్ని తాకుతూ
కొద్దిరోజుల కిందట కేరళకు( Kerala ) రుతుపవనాలు ప్రవేశించాయి. తరువాత గోవాలో విస్తరిస్తున్నాయి. కర్ణాటక,మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించాయి. రెండు మూడు రోజుల్లో ఏపీలో కూడా ఎంట్రీ ఇస్తాయని అంచనా వేస్తున్నారు. తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో సైతం రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే నాలుగు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తోంది. అయితే ఈసారి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం విశేషం. సాధారణంగా కేరళలో ప్రవేశించడం ద్వారా దేశంలోకి ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఇలా ప్రవేశించిన రోజే కేరళలో పూర్తిగా, తమిళనాడులో 90 శాతం, కర్ణాటకలో కొంత భాగం విస్తరించడం సాధారణం కాదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read : ఏపీకి బిగ్ అలెర్ట్.. ఆ జిల్లాలకు వర్ష సూచన!
* చురుగ్గా విస్తరిస్తున్న రుతుపవనాలు..
16 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎనిమిది రోజులపాటు ముందుగా రుతుపవనాలు రావడం ఇదే తొలిసారి. ఇప్పుడు ఈ రుతుపవనాలు శరవేగంగా కూడా విస్తరిస్తున్నాయి. ఏకకాలంలో అనేక రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. 1971లో కూడా ఇలానే జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన రోజే.. కర్ణాటకలో ఎక్కువ భాగం.. మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని గుర్తు చేస్తున్నారు. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో అల్పపీడనాలు ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే జూన్ 2 తర్వాత రుతుపవనాలు నెమ్మదిస్తాయని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
* వాయుగుండం బలహీనం..
మరోవైపు అరేబియా( Arabia ) సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మరి బలహీన పడింది. తీవ్ర అల్పపీడనంగా మారి మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఉంది. ఇది తూర్పు దిశగా కదులుతూ సోమవారం నాటికి మరింత బలహీన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్గడ్ మీదుగా ఒడిస్సా వరకు ఉపరితల ద్రోని కొనసాగుతోంది. దీనివల్ల మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మంగళవారం నాటికి వాయుగుండం గా బలపడుతుంది. దీని ప్రభావంతో సైతం ఏపీలో నాలుగు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.