AP Rain updates: ఏపీకి( Andhra Pradesh) వర్ష సూచన ఉంది. గత కొద్దిరోజులుగా వర్షాలు ముఖం చాటేశాయి. విశాఖలో మాత్రం కుండ పోత వర్షం పడింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఉండడంతో ఖరీఫ్ పనులకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వరి ఆకుమడులు ఎండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అల్పపీడనం కారణంగా ఏపీకి వర్ష సూచన ఉన్నట్లు చెప్పింది. రాజస్థాన్ పరిసరాల్లో వాయుగుండం ఏర్పడింది. అదే సమయంలో ఉత్తర జార్ఖండ్, దక్షిణ బీహార్ లో అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా తేమ, ఉక్కపోత కొనసాగుతూ వచ్చింది. కొన్ని జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. నిజంగా వర్షసూచనతో ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
తీవ్ర అల్పపీడన ప్రభావంతో..
ప్రస్తుతం ఉత్తర జార్ఖండ్( North Jharkhand ), దక్షిణ బీహార్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరప్రదేశ్ వైపు వెళ్తోంది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ప్రజలు అల్లాడిపోయారు. విశాఖ, కాకినాడ, తుని, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, బాపట్ల వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి ఏడు డిగ్రీల వరకు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది.
Also Read: Humanity is lacking in AP: వృద్ధురాలిని కరెంటు స్తంభానికి కట్టేశారు.. ఏపీలో మానవత్వం కరవుతోంది
ఖరీఫ్ లో ఆందోళన..
ప్రస్తుతం ఖరీఫ్( kharif) పనులు ప్రారంభం అయ్యాయి. కానీ వర్షాలు జాడలేదు. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో.. రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు విశాఖలో మొన్నటికి మొన్న భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది.
రుతుపవనాలు ముందే వచ్చినా..
అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. అందుకే మే నెలలో వర్షాలు పడ్డాయి. జూన్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయింది. జూలైలో సైతం వర్షాలు ముఖం చాటేసాయి. ఇప్పుడు అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉంది.