AP Property Tax: ఈ క్రమంలో ప్రజలకు కొంత ఊరట లభిస్తుంది. తాజాగా ఆస్తిపన్ను విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్ను బకాయిదారులకు మరోసారి ఊరట కలిగించే శుభవార్తను తెలిపింది. తాజాగా ప్రభుత్వం ఆస్తి మరియు ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీతో చెల్లింపు గడువును ఏప్రిల్ 30, 2025 వరకు పొడిగించడం జరిగింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ తేదీ 10.04.2025 ఉత్తరువులను జారీ చేసింది. గతంలో ప్రభుత్వం మార్చి 31, 2025 వరకు గడువున ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ గడువును ఒక నెల పొడిగించినట్లు తెలుస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఒక బలమైన కారణం కూడా ఉంది. గతంలో ఇచ్చిన గడువు మార్చి 31 లోపు చాలామంది ఆస్తిపన్ను బకాయిలను చెల్లించడంలో విఫలమయ్యారు. వడ్డీ రాయితీ ఉన్నప్పటికీ ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో మార్చి 31 లోపు వాళ్లందరూ చెల్లించాల్సిన ఇతర బకాయిలు పెండింగ్ ఉండడంతో వాళ్లు వాటిని క్లియర్ చేసుకోవడంపై తమ దృష్టిని పెట్టారు. దాంతో ఆస్తి పన్ను బకాయిలు అలాగే ఉండిపోయాయి.ఆ తర్వాత వాళ్లు వడ్డీ రాయితీతో ఆస్తి పన్ను చెల్లిద్దాం అనుకునే లోపు గడువు ముగిసిపోయింది. అలాంటి వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు.
Also Read: అటు UPI, ఇటు WhatsApp అంతరాయం.. ఇంతకీ ఏమైంది?
ప్రస్తుతం ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి చెల్లించాలి అనుకున్న వాళ్ళకి వడ్డీ పై 50% వరకు రాయితీ ఉంటుంది. ప్రభుత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని పన్ను చెల్లింపుదారులకు సూచించింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రజలు తమ బకాయిలను సులభంగా చెల్లించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. ఈ రాయితీ పథకం ముఖ్యంగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని ఆస్తి యజమానులకు బాగా ఉపయోగపడుతుందని తెలుస్తుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి మున్సిపల్ అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది.
ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారులకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ చెల్లింపు సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో వెళ్లి పన్ను చెల్లింపుదారులు పన్ను చెల్లించవచ్చు. లేకపోతే రెవెన్యూ ఆఫీస్ కి వెళ్లి పన్ను చెల్లించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువమంది ఆఫీసులకు వెళ్లి పన్ను చెల్లిస్తున్నారు. ఎందుకంటే పన్ను చెల్లించే సమయంలో వాళ్లకు కొన్ని డౌట్లు ఉంటాయి. ఆఫీసులో అయితే ప్రభుత్వ ఉద్యోగులను అడిగి ఆ డౌట్లకు క్లారిటీ తీసుకోవచ్చు.