UPI And WhatsApp: అంతకంతకు వినియోగదారులు పెరుగుతున్న నేపథ్యంలో వాట్స్అప్ సరికొత్త మార్పులు చేస్తోంది. గతంలో ఫోటోలకు, మెసేజ్లు పంపడానికి మాత్రమే పరిమితమైన వాట్సప్.. ఇప్పుడు ఏకంగా అతిపెద్ద నిడివి ఉన్న వీడియోలు పంపించే స్థాయికి ఎదిగింది. తాజాగా స్టేటస్లలో నచ్చిన పాటలను పెట్టుకోవడం.. వీడియోలను పెట్టుకోవడం.. పిడిఎఫ్ ఫైల్స్ ను పంపించుకోవడం వంటి మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక వాట్సప్ ఛానల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా మూడు బిలియన్లకు మించి యూజర్లతో అతిపెద్ద సోషల్ నెట్వర్క్ యాప్ గా వాట్సాప్ అవతరించింది. ఇంకా యూజర్లను పెంచుకుంటూ పోతుంది. ఈ యాప్ లో మరిన్ని మార్పులు తీసుకొచ్చేందుకు మెటా కంపెనీ కసరత్తు చేస్తోంది..
Also Read: పదే పదే స్పామ్ కాల్స్ వస్తున్నాయా.. ఎవరు చేస్తున్నారో తెలుసుకోండి
యూపీఐ డౌన్
ఇక డిజిటల్ చెల్లింపులకు కేంద్ర బిందువుగా ఉన్న యూపీఐ శనివారం డౌన్ అయింది. శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం పనిచేయలేదు. చెల్లింపులు జరగపోవడంతో ఖాతాదారులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇటీవల కూడా యూపీఐ సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు.. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం పనిచేయకపోవడంతో ఆవస్థలు ఎదుర్కొన్నారు. అయితే అటు యూపీఐ, ఇటు వాట్సప్ పనిచేయకపోవడానికి ప్రధాన కారణం సర్వర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలే కారణమని తెలుస్తోంది.. యూజర్లు పెరిగిపోవడం.. సర్వర్లపై ఒత్తిడి పెరగడంతో సేవలలో అంతరాయం ఏర్పడుతోంది. అయితే సాంకేతిక సమస్యను గుర్తించామని.. దానిని సరి చేస్తున్నామని యూపీఐ, వాట్సప్ వేర్వేరు ప్రకటనలలో తెలిపాయి. అటు యూపీఐ, ఇటు వాట్సప్ సేవలు నిలిచిపోవడంతో ఒక్కసారిగా ప్రపంచం కొద్ది గంటల పాటు స్తంభించి పోయింది.. అయితే ఈ సేవలలో కనుక అంతరాయం ఇలానే ఏర్పడితే ప్రపంచం మొత్తం పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఎందుకిలా జరుగుతోంది
డిజిటల్ విధానంలో చెల్లింపులు.. వాట్సాప్ ద్వారా సందేశాలు, ఫోటోలు, వీడియోలు పంపడం గతంతో పోల్చితే పెరిగిపోయింది. ఉదయం లేస్తే చాలు వాట్సాప్ చూడనిదే చాలామందికి రోజు మొదలు కావడం లేదు. ఇక డిజిటల్ చెల్లింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు కరెన్సీ అవసరం చాలా వరకు తగ్గిపోయిందంటే డిజిటల్ చెల్లింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా సర్వర్లపై పడుతున్న ఒత్తిడి సేవల్లో అంతరాయానికి కారణమవుతోంది. అయితే ఈ సేవలో అంతరాయం ఏర్పడటం వల్ల యూజర్లు, ఖాతాదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. పటిష్టమైన సర్వర్లను ఏర్పాటు చేసినప్పటికీ ఒత్తిడి అంతకంతకు పెరుగుతోందని వాటి కంపెనీలు పేర్కొంటున్నాయి.. సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా చూస్తామని చెబుతున్నాయి.