Hrithik Roshan: జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వార్ 2′(War 2 Movie). కొన్ని ప్యాచ్ వర్క్స్ తప్ప షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగష్టు 14 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషాల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవ్వడం తో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు. మరో పక్క హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ మూవీ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు ఆయనే దర్శకుడు కూడా. అయితే షూటింగ్ పూర్తి అయ్యాక కాస్త గ్యాప్ రావడం తో హృతిక్ రోషన్ అమెరికా ట్రిప్ కి వెళ్ళాడు. అక్కడ ప్రతీ రోజు ఎదో ఒక సిటీ లో అభిమానులతో ‘మీట్ & గ్రీట్’ కార్యక్రమం లో పాల్గొంటున్నాడు.
నేడు జరిగిన ఈ ప్రోగ్రాం లో ఆయన అభిమానులతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తో పని చేసిన అనుభూతి గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘వార్ 2 చిత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సాఫీగా జరిగిపోయింది. ఇంత కష్టమైన సబ్జెక్టు ఇంత తేలికగా పూర్తి అవ్వడానికి కారణం డైరెక్టర్ ఆయన ముఖర్జీ. జూనియర్ ఎన్టీఆర్ తో పని చేయడం ఒక గొప్ప అనుభూతి. అతనికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ‘వార్ 2′ నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. చాలా బాగా వచ్చింది. కచ్చితంగా మీ అందరినీ ఈ సినిమా మొదటి భాగం కంటే అధికంగా ఆకట్టుకుంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు హృతిక్ రోషన్. అంత పెద్ద సూపర్ స్టార్ ఎన్టీఆర్ గురించి ఇంత గొప్ప మాట్లాడడంతో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు కబీర్ (హృతిక్ రోషన్) టీం లో నిజాయితీ గా దేశం కోసం పని చేసినప్పుడు, ఆ టీం లోని కొంతమంది ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడుస్తారు. దీంతో పగపెంచుకున్న ఎన్టీఆర్ ఇదంతా కబీర్ మరియు ఇండియన్ ఆర్మీ చేయించింది అనే కసితో దేశంలోనే మోస్ట్ వాంటెడ్ శత్రువుగా మారిపోతారు. ఆ తర్వాత జరిగే స్టోరీ నే సినిమా. స్టోరీ వింటుంటే మీ అందరికీ పఠాన్ చిత్రం గుర్తుకు వచ్చింది కదూ. స్పై థ్రిల్లర్స్ స్టోరీ లైన్స్ మొత్తం ఒకేలా ఉంటాయి. కేవలం స్క్రీన్ ప్లే ఒక్కటే మారుతూ ఉంటుంది. ‘వార్ 2 ‘ మూవీ కూడా అదే విధంగా ఉంటుందని ఆశిస్తున్నారు అభిమానులు. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. ఈమె కూడా కబీర్ టీం లో ఏజెంట్ గా పని చేసే క్యారక్టర్ అట