AP Politics: అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. బాబాయ్ బూతు అంటూ చెవులు మూసుకుంటాడు.. తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటాడు.. గుర్తొచ్చింది కదా. ఇప్పుడు ఏపీ రాజకీయాలు కూడా అలానే ఉన్నాయి. అత్యంత దారుణంగా ఉన్నాయి. ప్రతిపక్షం, అధికార పక్షం ఏమాత్రం తగ్గకుండా బూతులు వాడటంలో పీహెచ్ డీ చేశాయి.
ఇటీవల ఓ ఛానల్లో అమరావతి గురించి చర్చ జరిగినప్పుడు.. డిబేట్ ప్యానెల్ లో ఉన్న ఓ జర్నలిస్టు నెత్తి మాసిన వ్యాఖ్యలు చేశారు. అడవులుగా మాట్లాడారు. ఆ తర్వాత అది రాజకీయంగా దుమారాన్ని రేపింది. ఒక రకంగా అధికార పార్టీకి అనుకొని ఆయుధాన్ని ఇచ్చింది. ఇంకేముంది ఆంధ్రప్రదేశ్లో మంటలు మండటం మొదలైంది. కొంత కాలంగా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న కూటమి ప్రభుత్వం.. ఈ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకున్నది. ప్రతిపక్ష వైసిపి మీద దుమ్మెత్తి పోస్తోంది. ఇక ఈ వ్యవహారంలోకి రాజధానికి భూములు ఇచ్చిన మహిళా రైతులు ప్రవేశించడంతో వివాదం మరింత పెరిగింది. అది ఏకంగా సాక్షిలో పనిచేసే సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుకు దారితీసింది. ఇక అప్పటినుంచి ఏపీలో రాజకీయ రచ్చ మరింత పెరిగిపోయింది.. ఇది ఎక్కడదాకా దారితీస్తుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే మంటలు బీభత్సంగా మండేస్తున్నాయి.
Read Also: భట్టికి హోమ్ శాఖ..? మంత్రుల శాఖల్లో మార్పులు..!
వైసీపీ అనుబంధ ఛానల్ లో వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తుంది అనే ఓ చానల్లో డిబేట్ పెట్టారు. ఈ డిబేట్ లో రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి మాట్లాడారు.. ఇటీవల జరిగిన పరిణామాలను, ఇతర విషయాలను విషయాలను ఆ డిబేట్ నిర్వహించే జర్నలిస్ట్ ప్రస్తావించగా.. రేణుకా చౌదరి ఆగ్రహంతో ఊగిపోయారు. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆమె తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. అసలు జగన్ పుట్టగానే విజయమ్మ గొంతు నులిమి చం** ఉంటే పీడ పోయేదని వ్యాఖ్యానించారు.. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలను డిబేట్ నిర్వహించే జర్నలిస్టు ఖండించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది.. దీనిని వైసిపి అనుకూల సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేస్తోంది. నాడు కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ నిర్వహిస్తుంటే ఎవరో చేసిన వ్యాఖ్యలను తమ పార్టీకి ఆపాదించారని.. తమ పార్టీ నాయకుడిని విమర్శిస్తున్నారని.. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే ఛానల్ లో రేణుకా చౌదరి ఈ తీరుగా వ్యాఖ్యలు చేశారు.. ఈ లెక్కన చంద్రబాబుకు కూడా వాటిని ఆపాదించాలా? అంటూ వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.”ప్రజా సమస్యలను ప్రస్తావించినందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. టీవీలలో చర్చ వేదికలు నిర్వహిస్తుంటే అరెస్టులు చేస్తున్నారు.. ఒకరకంగా హక్కుల హననానికి పాల్పడుతున్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక మాట నోరు జారి అన్నందుకు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇప్పుడు మీ అనుకూల చానల్స్ లో ఇలాంటి డిబేట్ నిర్వహిస్తే దాన్ని ఏమనుకోవాలి.. ఏకంగా గొంతు నులిమి.. అని వ్యాఖ్యలు చేస్తే వాటిని ఎలా చూడాలి.. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న మీ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి.. అధికారంలో ఉన్న కాబట్టి ఏదైనా చెల్లిపోతుంది అనుకుంటున్నారా.. ఇది ప్రజాస్వామ్యం కాదా.. ఇక్కడ అధికార పార్టీకి మాత్రమే హక్కులు ఉంటాయా.. ప్రతిపక్ష పార్టీకి హక్కులు ఉండవా” అంటూ వైసిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. అయితే దీనికి పోటీగా కూటమి ప్రభుత్వ నాయకులు కూడా గతంలో ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే అటు కూటమి.. ఇటు వైసిపి మధ్య ఒక రకమైన ప్రచ్చన్న యుద్ధం ఆంధ్రప్రదేశ్లో సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.