Homeఎంటర్టైన్మెంట్Balayya Atrocities and Result : అలాంటి సన్నివేశాల్లో బాలయ్య అరాచకం, వాటి రిజల్ట్ ఇదే!

అలాంటి సన్నివేశాల్లో బాలయ్య అరాచకం, వాటి రిజల్ట్ ఇదే!

Balayya Atrocities and Result : లెజెండ్ ఎన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ… స్టార్ హోదా సొంతం చేసుకున్నాడు. నటనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. బాలకృష్ణ వైవిధ్యమైన పాత్రలు చేశారు. భిన్నమైన జోనర్స్ ట్రై చేశారు. జానపద, పౌరాణిక, సైన్స్ ఫిక్షన్, పేట్రియాటిక్, సోషల్ డ్రామాలు చేశారు. ఇక ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు.మాస్ మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. బాలయ్య డైలాగ్ చెబితే గూస్ బంప్స్ రావాల్సిందే. కత్తి పడితే వంద తలలు తెగి పడాల్సిందే. ఆయన తొడ గొడితే ప్రేక్షకులకు గూస్ బంప్స్. బాలయ్య సినిమాలను ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటారు.

బాలయ్య నెగిటివ్ షేడ్స్ తో కూడిన రోల్స్ చేయడం విశేషం. ముఖ్యంగా సుల్తాన్ మూవీలో బాలకృష్ణ క్రూరమైన విలన్ రోల్ చేశాడు. టెర్రరిస్ట్ రోల్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాడు. సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ కాగా.. ఆ వెంటనే సుల్తాన్ మూవీ విడుదల చేశారు. ఈ మూవీలో కృష్ణ, కృష్ణంరాజు సైతం కీలక రోల్స్ చేశారు. అంటే ముగ్గురు కృష్ణులు నటించిన చిత్రం అన్నమాట. బాలయ్య డ్యూయల్ రోల్ చేశాడు. భారీ బడ్జెట్ తో సుల్తాన్ తెరకెక్కింది. టెర్రరిస్ట్ పాత్ర కోసం బాలకృష్ణ 11 రకాల గెటప్స్ వేయడం మరొక విశేషం. పోలీసులను డుమ్మా కొట్టించేందుకు బాలకృష్ణ అనేక గెటప్స్ ధరిస్తాడు.

Also Read : ‘గద’ కోసం బాలయ్య, బోయపాటి మధ్య మనస్పర్థలు..విషయం ఎంత దూరం వెళ్లిందంటే!

ఈ మూవీలో సొంత భార్యనే మానభంగం చేసేంత వైల్డ్ గా బాలకృష్ణ రోల్ ఉంటుంది. సమరసింహారెడ్డి థియేటర్స్ లో ఉండగానే సుల్తాన్ విడుదలైంది. అంచనాలు అందుకోలేకపోయింది. బాలకృష్ణ నెగిటివ్ రోల్ చేయడం, కృష్ణంరాజు పాత్ర చనిపోవడంతో పాటు సమరసింహారెడ్డి ఎఫెక్ట్ తో సుల్తాన్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మణిశర్మ అందించిన పాటలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. రెండు భిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ నటించి ఫ్యాన్స్ ని అలరించాడు. సుల్తాన్ రిజల్ట్ మాత్రం ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేసింది.

బాలకృష్ణ పవిత్ర ప్రేమ చిత్రంలో కూడా మానభంగం సన్నివేశంలో నటించడం విశేషం. అయితే ఆయనది నెగిటివ్ రోల్ కాదు. తాగిన మత్తులో పొరపాటున హీరోయిన్ లైలాను బాలకృష్ణ మానభంగం చేస్తాడు. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. సుల్తాన్, పవిత్ర ప్రేమ చిత్రాల్లో బాలకృష్ణ రేప్ సీన్స్ లో నటించగా, అవి రెండు నెగిటివ్ రిజల్ట్ అందుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular