AP Politics : “కులము కులము అన్న కురువంశము ఎన్నడో కులవిహీనమైపోయింది. ఇప్పుడు కొత్తగా కుల ప్రస్తావన ఎక్కడిది” మహాభారతంలో కుల ప్రస్తావన వచ్చినప్పుడు దుర్యోధనుడు చెప్పిన మాటలు ఇవి.. ఎన్నో వందల సంవత్సరాల క్రితమే కులం అనేది ఒక పంకిలమని దుర్యోధనుడు చెప్పాడు. ఇందులో కులం అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ప్రస్తుత ఏపీ రాజకీయాలు.. బూతు అనేది లేకుండా.. బూతు పలకకుండా సాగని పరిస్థితి. ఇందులో ఈ పార్టీ సుద్దపూస.. ఆ పార్టీ సుద్ధపూస అని చెప్పడానికి లేదు. అన్నీ ఆ తాను లో ముక్కలే.
పోసాని కృష్ణ మురళి వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారు.. నేరుగా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అనంతరం రైల్వే కోడూరు జడ్జి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ విచారణ జరిగిన తర్వాత .. న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం పోసాని కృష్ణమురళిని కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు. 14 రోజులపాటు ఆయనకు విచారణ ఖైదీగా రిమాండ్ విధించనున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై పోసాని కృష్ణ మురళి తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలోనే.. ఆయనపై కేసులు నమోదు చేసినట్టు ఏపీ పోలీసులు చెబుతున్నారు. పోసాని కృష్ణ మురళి అరెస్టు నేపథ్యంలో.. వైసిపి నాయకులు తెరపైకి కూటమి నాయకుల వీడియోలను తీసుకొస్తున్నారు.
Also Read : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి పై సీరియస్.. వైసిపి ఫిర్యాదు పై నోటీసులు జారీ!
కూటమి సుభాషితాలు
ట్విట్టర్లో గ్రాడ్యుయేట్ అడ్డా (Graduate adda) అనే ఐడిలో “కూటమి సుభాషితాలు” పేరుతో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బూతులు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలో పలు సందర్భాల్లో నారా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వైసిపి నేతలపై చేసిన విమర్శలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను ఆ వీడియోలో చూపించారు. ” వీళ్ళ మీద చర్యలు ఉండవా” అంటూ ఆ ఐడి నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది వైసిపి సానుభూతిపరులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఐడిలో కూటమి నేతలు మాట్లాడిన మాటలు.. గతంలో వారు ఇచ్చిన హామీలు.. చేసిన విమర్శల తాలూకూ వీడియోలున్నాయి. కూటమినేతలు చేసిన విమర్శల తాలూకూ సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన నేపథ్యంలో.. టిడిపి కార్యకర్తలు కూడా స్పందిస్తున్నారు. గతంలో పోసాని కృష్ణ మురళి, రోజా, ఇతర నాయకులు ఎలాంటి విమర్శలు చేశారు.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు. వారు అడ్డగోలుగా విమర్శలు చేశారు కాబట్టే.. ఇప్పుడు తీ తీరుగా స్పందించాల్సి వస్తోందని.. చర్యకు ప్రతి చర్య తప్పనిసరిగా ఉంటుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
వీళ్ళ మీద చర్యలు ఉండవా? pic.twitter.com/2Ag2MSFWwd
— Graduate Adda (@GraduateAdda) February 27, 2025
Also Read :ఊహించనిది.. అంచనా వేయనిది.. పోసాని కృష్ణ మురళికి టెంపర్ సినిమా చూపించిన కూటమి ప్రభుత్వం