PV Ramesh: ఏపీలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ గతంలో తనతో సన్నిహితంగా ఉన్న, తన వలన ఇబ్బందులు పడిన ఐఏఎస్ అధికారులను పిలిచి మరి దగ్గర పెట్టుకున్నాడు. వారికి మంచి హోదా కల్పించారు. జగన్ గతాన్ని గుర్తుపెట్టుకుని తమను బాగా చూసుకోవడంపై బ్యూరోక్రాట్స్ కూడా ఎంతో సంతోషించారు. అయితే, మళ్లీ ఏం జరిగిందో తెలీదు కానీ సీఎం జగన్ ప్రభుత్వానికి మాజీ సలహాదారుడు అయిన ఓ ఐఏఎస్ అధికారిని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు విఫలయత్నం చేశారు.

పీవీ రమేష్ ఐఏఎస్.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగాడు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో NIMS బాధ్యతలు సహా అత్యంత కీలకమైన పదవుల్లో ఈయన పని చేశారు. వైఎస్ మరణాంతరం జగన్ అక్రమాస్తుల కేసుల్లో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇక్కడే ఉంటే తనకు కూడా ప్రమాదం తప్పదని ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లినట్టు తెలిసింది. అయితే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేకంగా రాష్ట్ర సర్వీసుల కోసం ఆయన్ను తీసుకువచ్చారు. కీలక బాధ్యతలు కూడా అప్పగించారరు. పదవీ విరమణ పొందాక ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా కూడా నియమించారు. కానీ, ఇరువురికి ఎక్కడ చెడిందో తెలియదు కానీ పీవీ రమేశ్‌ను అవమానకరంగా జగన్ బయటకు పంపించారని తెలిసింది.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘డిజిటల్’ సెగ వైసీపీకి బాగానే తగులుతోందే?
నాటి నుంచి పీవీ రమేష్ మౌనంగా ఉండిపోయారు. ఏమీ మాట్లాడలేదు. కనీసం జగన్ ప్రభుత్వం నుంచి ఎందుకు బయటకు వచ్చారన్న విషయం కూడా బాహ్యప్రపంచానికి తెలియనివ్వలేదు. కానీ అప్పుడప్పుడు ఆయన సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్స్ చేస్తుంటారు. ఎవరినీ ఉద్దేశించి కామెంట్స్ చేయరు. అయితే, ఆయన చెల్లెలిని ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్ కుమార్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. కాగా, సునీల్ కుమారపై ఆయన భార్య గృహ హింస కేసు నమోదు చేయించింది. ఇదిలాఉండే ఒక్కసారిగా పీవీ రమేష్ అరెస్టుకు ఏపీ పోలీసులు ప్రయత్నించారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి ఏకంగా 20 మంది ఏపీ పోలీసులు వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. కుటుంబసభ్యులు మాత్రం ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డారని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: MLA Roja: ఈ సారైనా రోజాకు మంత్రి పదవి వచ్చేనా.. అడ్డుపడుతున్న సొంత పార్టీ వర్గాలు?